రాష్ట్రీయం

జగన్‌కు అపూర్వ ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, ఫిబ్రవరి 1: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ రెండోరోజైన గురువారం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో పర్యటించారు. తోడేరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం రాత్రి బస చేసిన ఆయన ఉదయం తొమ్మిది గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో ఆయనకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు పెద్దసంఖ్యలో హారతులిస్తూ నీరాజనాలు పలికారు. ఆయన వెంట ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. చాటగొట్ల క్రాస్‌రోడ్డు నుంచి చాటగొట్ల మీదుగా మరుపూరు వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు పాదయాత్ర నిర్వహించారు. తోడేరు క్రాస్‌రోడ్డు వద్ద సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి తండ్రి, పొదలకూరు మాజీ సమితి అధ్యక్షులు కాకాణి రమణారెడ్డి జగన్‌ను కలసి మాట్లాడారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తాము తక్కువ వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్నామని, తమను రెగ్యులర్ చేయాలంటూ ఏఎన్‌ఎంల సంఘ నేతలు జగన్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. చాటగొట్ల వద్ద జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మరుపూరు వరకు 8 కిలోమీటర్ల పాదయాత్ర ఉదయం 11 గంటలకు ముగించారు. ఇక్కడ నుంచి వెనుతిరిగి పొదలకూరు మీదుగా రేణిగుంటకు చేరుకుని విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు.

చిత్రం..పాదయాత్రలో మహిళల సమస్యలు తెలుసుకుంటున్న జగన్