రాష్ట్రీయం

పారిశ్రామికవేత్తల మిశ్రమ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, వచ్చే ఏడాది తొలి నాలుగునెలల్లో మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించారని, ఆరోగ్య బీమాకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమైన పరిణామమని కోటక్ మహీంద్ర బీమా కంపెనీ చీఫ్ ఇనె్వస్టిమెంట్ ఆఫీసర్ సుధాకర్ షాంబాగ్ అన్నారు. ద్రవ్యలోటు 3.5 శాతం ఉండడం ఎక్కువన్నారు. పది కోట్ల మందికి సాలీనా ఐదు లక్షల ఆరోగ్య బీమా వర్తింపచేయడం, కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర కంటే 1.5 శాతం పెంచి చెల్లించడం మంచి పరిణామన్నారు. వౌలిక రంగాలు, హౌసింగ్ అభివృద్ధి ద్వారా పట్టణ, గ్రామాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు కనపడుతోందన్నారు. పెగాసిస్టమ్స్ ఎండి సుమన్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ ఇండియా సాధన దిశగా భారత్ పయనించేందుకు ఈ బడ్జెట్ ఉపపయోగపడుతుందన్నారు. ఇ-గవర్నెన్స్‌కు ఊతం ఇచ్చారన్నారు. ఆర్ డికి మంచి ఫోకస్ ఇచ్చారన్నారు. విద్యారంగంలో వౌలిక సదుపయాల కల్పనకు విశేషమైన నిధులు ఇచ్చారన్నారు. ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, కౌలు రైతులకు సంక్షేమం, పదిలక్షల మంది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా, జాతీయ స్వర్ణ విధానం, చిన్న, మధ్య తరహా పరిశ్రమకు ప్రోత్సాహకాలు, విద్యారంగంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇచ్చారని, ఇది ప్రగతి శీల బడ్జెట్ అని అన్నారు. పేటమ్ పేమెంట్స్ బ్యాంక్ ఎండి రేణు సత్తి మాట్లాడుతూ అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు సర్వీసులు విస్తృతమవుతాయన్నారు.