రాష్ట్రీయం

విభజన హామీల ప్రస్తావనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, విభజన సమస్యలను ప్రస్తవించకపోవడంపై ఆ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా హామీలు అమలవుతాయని ఎదురుచూస్తున్న ఏపీ ప్రజల ఆశలపై కేంద్రం నీరుగార్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ కల్గించిందని వారు చెప్పారు. విభజన హామీలైన విశాఖకు రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు విషయంలో ఒక స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధరను 1.5శాతం పెంచడంవల్ల తీవ్ర కరవుతో అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్ర రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏపీలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోందని చెప్పారు. ప్రస్తుతం తాము రాజీనామాలు చేస్తే ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రశ్నించే పరిస్థితి ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.