రాష్ట్రీయం

గ్రామీణ భారతానికి ప్రాధాన్యం: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో రైతు, గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభు త్వం పెద్దపీట వేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనివల్ల ఏటా 50కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రంనుంచి నిధులు భారీగానే ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వినియోగం చేయకపోవడం వల్ల అదనపు నిధులు రావడం లేదని ఆయన పేరొన్నారు. గత బడ్జెట్‌లోనే ఎయిమ్స్‌ను కేంద్రం ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా స్థల కేటాయింపు జాప్యంవల్లనే అలస్యమవుతోందని పేర్కొన్నారు.