రాష్ట్రీయం

ఆంధ్రకు 33,930 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రతిపాదించిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 33,929.84 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. గత ఏడాది బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 29,001.25 కోట్లు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్‌లో ఏపీకి 4,928.59 కోట్లు అధికంగా లభిస్తున్నట్టు. ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.305 శాతం. కార్పొరేషన్ పన్నుల వాటా కింద 9,526.44 కోట్లు, ఆదాయం పన్ను వాటా కింద 8,430.37 కోట్లు, ఆస్తి పన్ను వాటా కింద 30 లక్షలు, కేంద్ర జీఎస్‌టీ వాటా కింద 10,919.22 కోట్లు, అనుసంధాన జీఎస్‌టీ వాటా కింద 904.05 కోట్లు, కస్టమ్స్ పన్నుల వాటా కింద 1,671.58 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్ను వాటా కింద 1,628.92 కోట్లు, 2016-17 సంవత్సరం సవరణల కింద 849.68 కోట్లు వెరసి 33,928.84 కోట్ల రూపాయలు ఏపీకి అందుతాయి. విశాఖ ఉక్కు కార్మాగారానికి 1,400 కోట్లు, పోర్టుకు 108 కోట్లు, భారత పెట్రోలియం, ఇంధన సంస్థకు 32 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 7 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి 10కోట్లు, ఎన్‌ఐటీకి 54 కోట్లు, ఐఐటీకి 50 కోట్లు, ట్రిపుల్ ఐటీకి 30 కోట్లు, ఐఐఎంకు 42 కోట్లు, ఐఐఎస్‌సీఆర్‌కు 49 కోట్లు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు 19.62 కోట్లు, పరిశ్రమలకు వడ్డీ రాయితీకోసం 50 కోట్లు కేటాయించారు. అయితే పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేటాయింపుల గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవటం గమనార్హం.