రాష్ట్రీయం

ఇప్పుడేం చేద్దాం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 1: కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీని కలిసి ఇబ్బందుల దృష్ట్యా బడ్జెట్‌లో నవ్యాంధ్రను కరుణించాలన్న చంద్రబాబు అభ్యర్థనను పట్టించుకోని కేంద్రం వైఖరిపై తెదేపా అసంతృప్తితో రగిలిపోతోంది. ఏపీకి టోపీ పెట్టి ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టిన వైనంపై అసహనం వ్యక్తం చేస్తోంది. కేంద్ర వైఖరిపై ఏవిధంగా అసంతృప్తి, నిరసన వ్యక్తం చేయాలన్న అంశంపై పార్టీ అంతర్మథనంలో పడింది. శుక్రవారం కేబినెట్ భేటీ, శనివారం మంత్రులతో విస్తృతస్థాయి చర్చల తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్‌ను పూర్తిగా అధ్యయనం చేసిన సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి కేటాయింపుల్లో చూపిన వివక్షపై సహచరుల వద్ద తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు యనమల, సోమిరెడ్డి, దేవినేని, ఆనందబాబుతో సమావేశమై బడ్జెట్ తీరును చర్చించారు. పొరుగునవున్న మహారాష్టక్రు రైల్వే పునరుద్ధరణకు లక్ష కోట్లు కేటాయించిన కేంద్రం, అన్యాయానికి గురైన రాష్ట్రానికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఏపీ ఆర్థిక కష్టాలను కొద్దికాలంగా కేంద్రానికి ఏకరవు పెడుతున్నాం. స్వయంగా ఫైలు మోసుకెళ్లి రాష్ట్రావసరాలపై ప్రధానికి నివేదిక ఇచ్చా. ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అయినా విదిలింపులతో సరిపెట్టడం కలవరపెడుతోంది. దీనిపై అసంతృప్తిని ఎలా వ్యక్తం చేయాలన్నది చర్చించి నిర్ణయిద్దాం’ అని చంద్రబాబు మంత్రులతో అన్నట్లు సమాచారం. ‘మనం ఎంత కష్టపడుతున్నామో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్లేమిస్తున్నారో కూడా చూస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటకలకు మెట్రోరైల్ బడ్జెట్ ఇచ్చి మనకు ఇవ్వకపోవడం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు. పోలవరంతో పాటు అమరావతి నిర్మాణానికీ నిధులివ్వకపోవడం, రైల్వేజోన్ హామీ నెరవేర్చకపోవడం పైనా బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏంచేయాలన్నది ఒకటి రెండురోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నామని మంత్రి సోమిరెడ్డి వెల్లడించారు. ప్రజాకాంక్ష నెరవేరకపోతే కీలక నిర్ణయానికీ వెనుకాడేది లేదన్నారు. రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని, అమరావతికి నయాపైసా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంటరీ పార్టీ భేటీలోగా గట్టిగానే చర్చిస్తామన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు.
బడ్జెట్ సారాంశం చూస్తే ఎన్డీఏ భాగస్వామిగా తగిన గౌరవం దక్కలేదన్న భావన ప్రజల్లో కనిపించిందని, బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశ, అసంతృప్తికి గురిచేసిందని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రం జాతీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చూడాల్సి ఉందన్నారు.
బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అవమానానికి నిరసనగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. 4న ఎంపీలతో బాబు నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘బీజేపీ మిత్రపక్ష ధర్మం పాటించలేదు. చివరకు చంద్రబాబును కూడా చిన్నచూపు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం, ద్రోహం జరిగిందని ప్రజలంతా భావిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎంపీలుగా మాపై ఉంది’ అని వ్యాఖ్యానించారు.
బడ్జెట్ కేటాయింపులు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్న భావన ప్రజల్లో కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు సహనాన్ని మోదీ పరీక్షిస్తున్నారన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో ఉందన్నారు. ప్రజలు కోరుకోని విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడం, భాగస్వామ్య పక్షంగా బీజేపీ బాధ్యతగా మేధావులు అభిప్రాయపడుతున్నారన్నారు.
జోన్‌ను సెంటిమెంట్ చేసింది బీజేపీనే: అయ్యన్న
రైల్వేజోన్ ప్రకటించకపోవడం బాధాకరమని, అసలు దాన్ని సెంటిమెంట్ అంశంగా మార్చింది బీజేపీనేనని, మోదీ కూడా అనేక సభల్లో హామీ ఇచ్చారని మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. పొత్తు తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ వస్తాయని, అప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం సాధ్యం కాదుకదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మిత్రపక్షంగా ఉన్నా ఈవిధంగా కేటాయింపులు చేయడం అన్యాయమని ఆయన నిరసన తెలిపారు.