రాష్ట్రీయం

తెలంగాణకు 19,207 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రతిపాదించిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు 19,207.43 కోట్ల రూపాయల నిధులు ప్రతిపాదించారు. గత ఏడాది బడ్జెట్ నుండి తెలంగాణకు 16,420.06 కోట్లు లభించాయి. దాంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్రానికి 2,787.37 కోట్లు అధికంగా వస్తున్నట్టే. 2018-19 వార్షిక బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ వాటా 2.437 శాతం. తెలంగాణకు 2018-19 బడ్జెట్ నుండి కార్పొరేట్ పన్నుల రూపంలో 5,392.78 కోట్లు, ఆదాయం పన్ను వాటా కింద 4,772.31 కోట్లు, ఆస్తి పన్ను వాటా కింద 0.17 కోట్లు, కేంద్ర జీఎస్‌టీ వాటా కింద 6,181.16 కోట్లు, అనుసంధాన జీఎస్‌టీ వాటా కింద 511.77 కోట్లు, కస్టమ్ డ్యూటీ వాటా కింద 946.26 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ వాటా కింద 922.11 కోట్లు, 2016-17 సర్దుబాటు కింద 481.21కోట్లు వెరసి మొత్తం 19,207.43 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఐఐటీకి 75కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసీన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కేంద్రానికి బడ్జెట్‌లో నాలుగు కోట్లు కేటాయించారు. విజ్ఞాన భారతి టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పనె్నండు లక్షలు ఇచ్చారు. గిరిజన వర్శిటీకి 10కోట్లు, సింగరేణికి 2వేల కోట్లు, పరిశ్రమలకు వడ్డీ రాయితీకోసం 50కోట్లు కేటాయించారు. నల్గొడ- లింగంగుంట మార్గంలో 129 కిలోమీటర్ల రైల్వే లైనును, పెద్దపల్లి-లింగంపేట మార్గంలో 83 కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరిస్తారు.