రాష్ట్రీయం

గురి తప్పిన పద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన మేరకు నిధులు కేటాయింపు జరుగకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్ ప్రజలపై ఎలాంటి ముద్ర చూపలేదని తెలంగాణ ప్రభుత్వం పెదవి విరిచింది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ప్రగతిశీల నిర్ణయాలతో ముందుకెళ్తుంటే కనీసం కేంద్రం నుంచి చేయూత కరువైందని రాష్ట్ర ప్రభుత్వం వాపోయింది. విభజన హామీల అమలు అంశాలపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోగా కనీసం దేశంలోనే వినూత్నంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్రం మొండి చెయ్యి చూపింది. ఈ రెండు పథకాలకు కేంద్రం నుంచి సుమారు రూ. 25 వేల కోట్లు సహాయం అందించాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కూడా పట్టించుకోక పోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా కనీసం రూ.10 వేల కోట్లు అయినా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక గొప్ప మెగా ప్రాజెక్టుగా నిలువబోతుందని కేంద్ర జల సంఘం స్వయంగా ప్రశంసించిన కేంద్రం నయా పైసా కేటాయించలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్, గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజురు చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. గుడ్డిలో మెల్లగా సింగరేణికి రూ. 2 వేల కోట్లు కేటాయించడం కాస్త ఊరట నిచ్చింది. ఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర వాటన్నింటికీ కలిపి రూ. 40 వేల కోట్లు ఇవ్వాలని బడ్జెట్ సమావేశాలకు ముందు ఆర్థిక మంత్రులతో జరిపిన సమాలోచన సందర్భంగా కోరినప్పటికీ కేంద్ర పట్టించుకోలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య పోటీని పెంచేలా కేంద్రం నిర్ణయాలు ఉండాలని ఈటల అభిప్రాయపడ్డారు. మెరుగైన, నాణ్యమైన విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేస్తే వీటికి కనీసం కొంతలో కొంతైనా ఆర్థిక సహాయం చేయలేదని ఈటల అన్నారు. రాష్ట్రంలో రైతులకు 17 వేల కోట్ల రుణ మాఫీ చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ధాన్యాన్ని నిలువ చేసేందుకు 18 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించామని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు కేంద్ర బడ్జెట్ కొంత ఊతం ఇచ్చేలా ఉన్నా నిధులు కేటాయింపులో మాత్రం నిబద్ధత కనిపించలేదన్నారు. మొత్తం మీదా ఈ బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం కోరిన ఏ రంగానికి నిధుల కేటాయించకపోవడం సరికాదని, ఇది ఏమాత్రం ఆశజనకంగా లేదని ఈటల పెదవి విరిచారు. ఇలా ఉండగా కేంద్ర బడ్జెట్ కంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెటే మెరుగని టిఆర్‌ఎస్ ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే పన్నుల ఆదాయం ఎక్కువే అయినప్పటికీ ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు.

చిత్రం.. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్