రాష్ట్రీయం

టీటీడీ రూల్ 9ని తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న 36 మంది హైందవేతర ఉద్యోగులు టిటిడి ఉద్యోగుల సర్వీసు రూల్స్‌లో 9 (4) ప్రకారం హైందవేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధించే నిబంధనను తొలగించాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. టిటిడి స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థని, రాష్ట్రప్రభుత్వ సహాయంతో టిటిడి పనిచేయడం లేదన్నారు. టిటిడిలోని వేరువేరు సంస్థల్లో 1998 నుంచి 2005 మధ్య అనేక ఉద్యోగాల్లో తాము నియమితులయ్యామన్నారు. తమకు జనవరి 11వ తేదీన షోకాజ్ నోటీసును టిటిడి కార్యాలయం జారీ చేసిందన్నారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని, రూల్‌ను అక్రమమని ప్రకటించాలని వారు కోర్టును అభ్యర్థించారు.