రాష్ట్రీయం

బుద్ధం శరణం గచ్ఛామి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 3: అమరావతి.. ఆ పేరు వింటేనే బౌద్ధులు పులకించిపోతారు. దేశ తూర్పు తీరంలో బౌద్ధ మత ప్రచారంలో నాటి అమరావతి ప్రధాన భూమిక పోషించింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధానికి అమరావతి పేరు పెట్టారు. కృష్ణా, గుంటూరు సహా కోస్తా జిల్లాల్లో బౌద్ధ మతం పరిఢవిల్లిన తీరుకు గుర్తుగా అనేక ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటికి ప్రచారం లేక ప్రపంచ వ్యాప్త గుర్తింపునకు నోచుకోవడం లేదు. బౌద్ధానికి సంబంధించి ఘనమైన పురావస్తు సంపద, వారసత్వం ఉన్నప్పటికీ, ఆ మేరకు బౌద్ధ పర్యాటకులు రాష్ట్రానికి రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బౌద్ధ మత ప్రాభవాన్ని ప్రపంచానికి తెలియచేసేందుకు, విశ్వశాంతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి బౌద్ధ మత వారసత్వ మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. విజయవాడలో శనివారం ప్రారంభమైన ఈ మహోత్సవం ప్రభుత్వ లక్ష్యాన్ని సఫలీకృతం చేసింది. విజయవాడకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన బౌద్ధులతో నగరం కొత్త శోభను సంతరించుకుంది. బుద్ధం శరణం గచ్చామి.. అంటూ కాషాయాంబరాలు, ప్రత్యేక టోపీలు ధరించిన బౌద్ధులతో మహోత్సవాన్ని నిర్వహించిన పీడబ్ల్యూడీ మైదానం కళకళలాడింది. విశ్వశాంతి కోరుతూ గ్లోబల్ శాంతి ర్యాలీని నగరంలో పీడబ్ల్యూడీ మైదానం నుంచి గేట్‌వే హోటల్ వరకూ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవం నగర ప్రజల దృష్టిని ఆకర్షించింది.
బౌద్ధంలోని శాంతి కాముకతను అమరావతి బౌద్ధ వారసత్వ మహోత్సవం ద్వారా ప్రజలకు అందించి ఏపీలో టూరిజంను ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తున్నామని ఏపీ టూరిజం టెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.జయరామిరెడ్డి తెలిపారు. శనివారం పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం అమరావతి బౌద్ధ వారసత్వ మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి రావాలని, దానికి మన రాష్ట్రంలోని పురాతన బౌద్ధ స్థలాలు ఒక వేదికగా ఉపయోగిస్తున్నామన్నారు. గ్లోబల్ శాంతికి దోహదం చేసేందుకు బుద్ధిజం ఒక సాధనంగా ఉపయోగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బుద్ధిజం వారసత్వ ప్రాంతాలను ప్రమోట్ చేసి టూరిజంను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలను ఇలాంటి కార్యక్రమాలల్లో భాగస్వామ్యం చేసి వారిని చైతన్యం చేయటానికి వీటిని ఉపయోగిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హిమాంశు శుక్లా మాట్లాడుతూ అమరావతి రాజధానిలో బౌద్ధంను ప్రమోట్ చేసేందుకు 3,4,5 తేదీల్లో గ్లోబల్ శాంతికి అమరావతి బౌద్ధ వారసత్వ మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్లోబల్ శాంతి కార్యక్రమంలో కొరియా, చైనా, తైవాన్, శ్రీలంక లాంటి 10 దేశాల నుంచి 1500 మంది మాంక్స్ 40 ప్రదేశాల నుంచి హీనయానం, మహాయానం, వజ్రయానం శాఖల నంచి బౌద్ధులు వచ్చారన్నారు. రాష్ట్రంలో బుద్ధిజం అంటే బుద్ధగయ, సాంచి, ధర్మశాలలు గుర్తుకు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఘంటశాల, జగ్గయ్యపేట, నాగార్జునకొండ లాంటి 100కు పైగా బుద్ధిజం ప్రదేశాలు ఉన్నా పెద్దగా ఆదరణ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న బుద్ధిజం ప్రదేశాలను ఆదరించి, ప్రోత్సహించటం ద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పటానికి అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ బి.లక్ష్మీకాంతం శాంతి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఘంటశాలలో 100 అడుగుల మహాపర్యాణం చేపట్టామని ఇది త్వరలోనే పూర్తవుతుందన్నారు. ప్రపంచ శాంతిని పురస్కరించుకుని పర్యాటక రంగం ఆధ్వర్యంలో గ్లోబల్ శాంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

చిత్రాలు... విజయవాడలో బౌద్ధుల ప్రదర్శన *.అమరావతి బౌద్ధ వారసత్వ మహోత్సవాలను ప్రారంభిస్తున్న అఖిలప్రియ