రాష్ట్రీయం

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలన్న భావనతో ఎన్టీఆర్ ట్రస్టు ప్రత్యేక కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. మహిళల కోసం ప్రత్యేకంగా స్వీట్లు, చైనీస్, బ్రేక్ ఫాస్ట్, రెస్టారెంట్, బేకరీ ఫుడ్స్‌ను తయారు చేయడంలో అనుభవం ఉన్న వారితో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇవో) టి. విష్ణువర్ధన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి వద్దే వంటకాలు తయారు చేసి మార్కెట్‌కు సరఫరా చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోర్సు ఫీజు భరించ లేని వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల మహిళలు బంజారాహిల్స్ రోడ్డు నెం.2లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌లో సంప్రదించవచ్చని లేదా ఫోన్ నెంబర్లు 040-30145800, 9652210528కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.