రాష్ట్రీయం

గీతం ఫెస్టు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: పలు వైవిధ్య కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ , దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనడం ద్వారా ప్రమాణ కార్యక్రమం జోష్ పెంచిందని గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రమాణ కార్యక్రమం శనివారం నాడు విజయవంతంగా ముగిసిందని సమన్వయ కర్త డాక్టర్ ఎన్ వి స్వామినాయుడు తెలిపారు. హిప్‌హిప్ హుర్రే నినాదాలు, చప్పట్లు, విజిల్స్, హోరెత్తిన యువత, మైమరిపించే నృత్యాలు, బృందాలుగా ఏర్పడి ఒకరితో మరొకరు సంతోషాన్ని పంచుకుంటూ విద్యార్ధులు అంతా గీతం యూనివర్శిటీలో ఆనందంగా కనిపించారు. మూడు రోజుల పాటు సాంకేతిక , యాజమాన్య, సాంస్కృతిక ఉత్సవాలతో గీతం వర్శిటీ విద్యార్థులతో సహా జంటనగరాల నుండి కూడా దాదాపు 15వేల మంది విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. గెలుపు ఓటమితో పనిలేకుండా అనేక పోటీల్లో వీరంతా పాల్గొన్నారు. ఐడిల్ విజేత ఎల్ వి రేవంత్, చంద్రుడిపైకి రోవర్‌ను పంపిన తొలి ప్రైవేటు కంపెనీ టీమ్ ఇండస్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, క్రిప్టోకరెన్సీ గురించి ప్రజిత్ దత్తా విడమరిచి వివరించారు.