రాష్ట్రీయం

బాబూ.. డ్రామాలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 3: నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నింటిలో వైఫల్యం చెంది, ప్రజలను మోసగిస్తూ ఇపుడు ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఇలాంటి దగాకోరు రాజకీయాలు చేసేవారు ప్రపంచంలో మరెక్కడా ఉండరని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న ఆయన శనివారం నెల్లూరు గ్రామీణ మండలం సౌత్ మోపూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని బిజెపి తమను తొలిసారే మోసగించినట్లు టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికి నాలుగు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది కేంద్రంలో టిడిపి భాగస్వామ్యంతో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం పొందిన తరువాతే కదా బడ్జెట్ ప్రవేశ పెడతారు? కాబట్టి ఇందులో చంద్రబాబు ఆమోదం కూడా ఉందన్నారు. ఇప్పటి వరకు మోదీని ప్రశంసలతో ముంచెత్తి, కేంద్రం చేసే మేలు అంతా ఇంతా కాదని, ప్రత్యేక హోదా కూడా అవసరం లేదని నమ్మబలికిన చంద్రబాబు అకస్మాత్తుగా మోదీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. విద్యా పరంగా జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ విఎస్ వర్శిటి ఏర్పాటు చేశారని ఇపుడు దాని పరిస్థితి బోధన, బోదనేతర సిబ్బందిని భర్తీ చేయక విద్య కుంటుపడిందన్నారు. ఉన్న ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి దాపురించిందన్నారు. నాడు జాబు కావాలంటే బాబు రావాలని ఊకదంపుడు వాగ్దానాలు చేశారని నేడు
జాబు ఉండాలంటే బాబు పోవాలనే పరిస్థితి తలెత్తిందన్నారు. పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఇంథన పన్నులు రాష్ట్రంలో విధిస్తున్నారని ఆరోపించారు. అధికారం చేపట్టాక మద్యం అమ్మకాలు తగ్గించి, బెల్ట్ దుకాణాలు లేకుండా చేస్తానని వాగ్దానం చేసి అధికారం చేపట్టాక మద్యం అమ్మకాలు గణనీయంగా పెంచాడన్నారు. ఆర్‌టిసి, విద్యుత్ బిల్లులు షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొందని, గతంలో చౌక దుకాణాల్లో పప్పు, ఉప్పు వంటి 9రకాల నిత్యావసరాలు లభ్యమయితే నేడు బియ్యం మరేది లేదని దానికి వేలిముద్రల సాకుతో పేదల ఉసురు పోసుకుంటున్నారన్నారు. రైతు రుణ మాఫీ, వ్యవసాయ బంగారు రుణమాఫీ అన్న చంద్రబాబు రైతులకు బ్యాంక్ నోటీసులు అందుతున్నాయని రుణ తీసుకున్న నిధులకు వడ్డీలకు కూడా సరిపోని కేటాయింపులు చేసి రైతులను మోసగించాడన్నారు. మరో వైపు పొదుపు రుణాలలో మహిళలను మోసం చేసి తన మోసకారి నైజాన్ని చాటాడని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని యువతకు లక్షల ఉద్యోగాలు వస్తాయని కొత్త పల్లవి అందుకున్నాడన్నారు. చంద్రబాబు నల్లడబ్బు దాచుకునేందుకు ప్రైవేటు విమానాల్లో విదేశాలకు వెళతాడని తన అనుకూల మీడియాలో మాత్రం పెట్టుబడులు ఆకర్షించేందుకు అని చెప్పిస్తాడన్నారు. చంద్రబాబుకు మళ్లీ అవకాశం ఇస్తే మిమ్మల్ని నమ్మించడానికి ఇంటికి కేజీ బంగారం అంటాడని మీరు నమ్మరు కాబట్టి బోనస్‌గా బెంజి కారు కొనిస్తానంటాడని ప్రజలు నమ్మరు కాబట్టి తన నల్లడబ్బుతో ఓటుకు 3వేలుకు కొనుగోలు చేయగలడన్నారు. అది మన నగదే కాబట్టి తీసుకోండి కానీ ఎన్నికలలో మాత్రం తగిన బుద్ధి చెప్పండని ఉద్బోదించారు. స్వంత మామకు వెన్నుపోటు పొడిచిన అల్లునికి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయటం చాలా తేలికని ఎద్దేవా చేశారు.
నెల్లూరు నగర కార్పొరేషన్‌లో ఇటీవల 15 గ్రామాలు విలీనం చేసి హడ్కో నుండి 1100కోట్లు రుణం తెచ్చినా గ్రామాల్లో కనీస వౌలిక వసతులకు గతి లేదన్నారు. హడ్కో నుండి రుణం కాకుండా గ్రాంట్ పొందాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదన్నారు. నెల్లూరు బ్యారేజీ ఆధునికీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలోనూ స్కామ్ జరుగుతోందని, పేదలకు లక్షల రూపాయలలో ఇళ్లు అమ్మటం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవంగా చదరపు అడుగు నిర్మాణానికి 850 రూపాయలు ఖర్చు అయితే చంద్రబాబు 2వేల రూపాయలు ప్రజలనుండి వసూలు చేస్తూ దగా చేస్తున్నాడన్నారు. అందులోనూ కేంద్రం-రాష్ట్రం సమానంగా వ్యయాన్ని భరిస్తే పేదల నుండి వసూలుకు పూనుకోవటం దారుణమన్నారు.

చిత్రం..నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న జగన్