రాష్ట్రీయం

ఏపీ నిట్‌లో ర్యాగింగ్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 3: ఏపీ నిట్‌లో ర్యాగింగ్ కలకలం రేకెత్తించింది. నిట్ కళాశాలకు చెందిన ద్వితీయ, తృతీయ సంవత్సర సీనియర్ ఆంధ్రా విద్యార్థులు మొదటి సంవత్సరానికి చెందిన బీహార్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఈ కలకలం రేగింది. శుక్రవారం సాయంత్రం మొదటి సంవత్సరం చదువుతున్న బీహార్‌కు చెందిన ముకుల్ కుమార్‌ను ఐదుగురు సీనియర్ విద్యార్థులతో పాటు మరికొంతమంది ర్యాగింగ్ చేసినట్టుగా సమాచారం. వీరి మధ్య ఘర్షణ తలెత్తడంతో ముకుల్ కుమార్‌పై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డుపై కూడా చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటనతో పెదతాడేపల్లి వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న నిట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల యాజమాన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాగింగ్‌కు, భౌతిక దాడులకు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల బయట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన వ్యక్తులైన ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాలకు చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మూడవ సంవత్సరానికి చెందిన గుణసాయిప్రకాష్, రెండవ సంవత్సరానికి చెందిన సుశాంత్ జోయల్, సాకేత్, పృథ్వీరాజ్, శ్రీనివాస్‌లతో పాటుగా మరో పది మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నిట్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై ఘర్షణ చర్యల్లో భాగంగా ఐదుగురిని సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటనపై కమిటీని నియమించామన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎన్ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై పదిహేను మంది విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు.

నిట్ ప్రాంగణంలో ఆందోళనకు దిగిన విద్యార్థులు