రాష్ట్రీయం

జిల్లాలకూ రైతు సమితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రస్తుతం ఏర్పాటైన గ్రామ, మండల స్ధాయి సమితులకు తోడు త్వరలో జిల్లాస్థాయ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా మంత్రులను ఆదేశించారు. జిల్లాస్థాయి సమన్వయ సమితి ఏర్పాటు అనంతరం కార్పొరేషన్ తరహాలో రాష్ట్ర స్థాయి సమితి ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఒక ఉన్నతాధికారిని నియమించే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర సమన్వయ సమితి ఏర్పాటు అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున గ్రామ, మండల, జిల్లా సమన్వయ సమితులతో కలిసి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం నాడిక్కడ ప్రగతి భవన్‌లో సమీక్షలో మంత్రులు, ఎంపిలు, ఉన్నతాధికారులతో సిఎం ప్రసంగించారు. వ్యవసాయదారులకు అమలు చేస్తున్న పథకాలు, రైతుల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాం, రైతులకు పెట్టుబడి పథకం, రైతు సమన్వయ సమితిల ఏర్పాటు తదితర అంశాలపై వారితో సిఎం సుధీర్ఘంగా చర్చించారు. ఏ పంట ఎన్ని రకాలు ఎక్కడ వేశారో తెలుసుకుని రైతులు పండించిన పంటల మార్కెటింగ్, సరైన ధర లభించే విషయంలో బాధ్యతను సమన్వయ సమితులు తీసుకోవాలని తెలిపారు. రైతులంతా తాము పండించిన ధాన్యాన్నీ ఒక విధమైన నియంత్రించే పద్దతిలో మార్కెట్‌కు తేవాలని, ఈ విషయంలో సమన్వయ సమితులు సూచనలు చేస్తాయని తెలిపారు. మార్కెట్‌లో అమ్మకం జరగకపోతే రైతు సమన్వయ సమితి దాన్ని కొంటుందని సిఎం చెప్పారు. రైతు సమన్వయ సమితుల పాత్ర నేపధ్యంలో మార్క్‌ఫెడ్ పనితీరు పునర్‌నిర్వచించాలని ఆయన సూచించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత రోజు రోజుకీ పెరుగుతోందని, కొన్ని రోజులు పోతే నాట్లు, కోతలు కోసే వారు లభించడం కష్టమని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో వరినాట్లు, కోతలు కోసే మిషన్లు, వీడర్స్‌ను రైతులకు సబ్సిడీపై సమకూర్చాలని సిఎం సూచించారు. ప్లాంటేషన్ మిషన్లను 50 శాతం సబ్సిడీతో అన్ని మండలాలకు సరఫరా చేయాలని సిఎం అన్నారు. 30 జిల్లాల్లో కనీసం వంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, దాదాపు శాసనసభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉండాలని సిఎం సూచించారు. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులు పూర్తయితే సాగునీరు పుష్కలంగా లభిస్తుందని, వర్షాకాలంలో పంట కింద ఎక్కువగా వరి పంట వేస్తారని, అందువల్ల రైస్ మిల్స్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సిఎం తెలిపారు. కాగా ఆహార కల్తీ నిరోధానికి ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు, పంటలకు మద్దతు ధర సాధించడానికి ఏం చేయాలనే అంశంపై వ్యవసాయ మంత్రి పోచారం, ఆర్ధిక మంత్రి ఈటల, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు, పరిశ్రమల మంత్రి కెటిఆర్‌తో కూడిన మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. అలాగే బడ్జెట్ సమావేశాల్లో టిఆర్‌ఎస్ ఎంపీలు లేవనెత్తాల్సిన అంశాలపై సిఎం సూచనలు ఇచ్చారు. ఇంత వరకు కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే తమకు అందాల్సిన విషయంలో పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రస్తావించాలని, ప్రతి పంటకు ఇవ్వబోయే మద్దతు ధర గురించి సభలో ప్రకటించాలని పట్టుబట్టాలని ఎంపిలకు సూచించారు. రిజర్వేషన్ల అంశం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, టెక్స్‌టైల్ పార్కుకు నిధులు మంజూరు, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ను వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అంశంపై నిలదీయాలని చెప్పారు. ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షలో మంత్రులు హరీశ్, నాయిని, పోచారం, జగదీష్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపిలు కేశవరావు, జితేందర్ రెడ్డి, డి.శ్రీనివాస్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వినోద్, కొండా విశే్వశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బిబి పాటిల్, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు జిఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సిఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..జిల్లా రైతు సమితుల ఏర్పాటుపై ప్రగతి భవన్‌లో మంత్రులతో చర్చిస్తున్న సీఎం కేసీఆర్