రాష్ట్రీయం

భారీగా పోలీస్ రిక్రూట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: నిరుద్యోగ యువకులకు శుభవార్త. అటు పోలీస్ ఉద్యోగాలు, ఇటు సాంఘిక సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలో పోలీసు శాఖను పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని ప్రకటించనుంది. ఉద్యోగాల భర్తీపై పూర్తి స్థాయి ఫైలు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. ఇక సీఎం కార్యాలయం ఫైలును క్లియర్ చేయడమే తరువాయ. 14వేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 8 వేల వరకు సివిల్ పోలీసు కానిస్టేబుళ్లు, మూడు వేల వరకు ఆర్మ్‌డ్ రిజర్వ్ పోస్టులు, ఇతర పోలీసు విభాగాల్లో మరో మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని పోలీసు శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత పోలీసు శాఖలో పెద్ద ఎత్తున పోలీసుల కొరత తలెత్తింది. జిల్లాకు
కనీసం 400మంది పోలీసు కానిస్టేబుల్ పోస్టులను మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తయినట్లు సమాచారం. తెలంగాణ ఆర్మ్‌డ్ రిజర్వు, స్పెషల్ పోలీసు విభాగంలోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ ఏడాది పంచాయితీ, మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు బందోబస్తు అవసరం. రాష్ట్రంలో నగరీకరణ త్వరితగతిన విస్తరిస్తోంది. పెద్ద సంఖ్యలో జిల్లాలను ఏర్పాటు చేయడంతో పోలీసు శాఖను ఆధునీకరణపై హోంశాఖ దృష్టిని సారించారు.
రూ.6వేల కోట్ల బడ్జెట్‌కు ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖకు వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ.6వేల కోట్ల నిధులు కావాలని ప్రతపాదనలను ప్రభుత్వానికి పంపారు.దేశం మొత్తం మీద పంజాగుట్ట పోలీసు స్టేషన్ ఆధునీకరణ తదితర విభాగాల్లో రెండవ పోలీసు స్టేషన్‌గా నిలిచింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోలీసు స్టేషన్లను ఆధునీకరించి ఆదర్శ పోలీసుస్టేషన్లుగా మార్చేందుకు పోలీసు శాఖ దృష్టిని సారించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. కొత్త జిల్లాల్లో కొత్తగా 300 పోలీసు స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు. గత ఏడాది బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను పోలీసు శాఖకు కేటాయించింది. కొత్త బడ్జెట్‌లో సాధారణంగా 20 శాతం ఎక్కువగా నిధులు కేటాయిస్తారు. కాని పోలీసు శాఖ చేపట్టిన వివిధ ఆధునీకరణ ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని అడిగినంత కాకపోయినా తగినన్ని నిధులను ప్రభుత్వం కేటాయించే అవకాశం కనపడుతోంది. ఈ సారి పోలీసు సంక్షేమం, విద్య, ఉన్నత విద్యకు ఎక్కువగా నిధులు ఇవ్వాలని పోలీసు శాఖ కోరింది.
సోషల్ వెల్ఫేర్‌లో 549 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లోవ 549 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ప్రిన్సిపల్ గ్రేడ్-2 పోస్టులు 3, జూనియల్ లెక్చరర్లు -10, పిజిటిలు 52, టిజిటిలు 418, పిఇటిలు 22, లైబ్రరియన్లు 12, క్రాఫ్ట్ టీచర్లు-10, ఆర్టు టీచర్లు-5, మ్యూజిక్ టీచర్లు-5, స్ట్ఫానర్సులు -12 ఉన్నాయి. వీటన్నింటి భర్తీ బాధ్యతను ప్రభుత్వం పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించింది.