రాష్ట్రీయం

ప్రజాసమస్యలపై జనసేన సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం ప్రజల నుండి వచ్చిన సమస్యలపై జనసేన పార్టీ గత కొద్ది రోజులుగా మేథోమదన సమీక్ష నిర్వహిస్తోంది. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలను, అవసరాలను నొక్కి చెప్పేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు. ఇందుకు ఇప్పటికే ప్రధాని కార్యాలయాన్ని కోరినట్టు సమాచారం. ప్రధాని కార్యాలయం నుండి అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే ఆంధ్రా నుండి కొంత మంది, తెలంగాణ నుండి కొంత మంది నేతలతో కలిసి జనసేన అధ్యక్షుడు ప్రధాని నరేంద్రమోదీని కలిసి పరిస్థితులను వివరించనున్నారు.
కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, అనంతపురం జిల్లాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ జరిపిన పర్యటనలను విజయవంతం చేసిన వారందరికీ పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనల్లో తమ అధ్యక్షుడి దృష్టికి అనేక సమస్యలు వచ్చాయని, ముఖ్యంగా క్షామపీడిత ప్రాంతమైన అనంతపురంలో కరవు కారణాలను ప్రజాప్రతినిధులు, రైతులు, మేథావులు, పార్టీ అధ్యక్షుడికి వివరించారని చెప్పారు. వీటిపై పార్టీ సమీక్ష ప్రారంభించిందని మహేందర్‌రెడ్డి చెప్పారు. నిపుణులు, పార్టీలోని కొందరు ముఖ్యులతో కలిసి సమస్యలను విశే్లషించే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారని అన్నారు. పరిశీలన అంతరం ఒక నివేదిక తయారుచేస్తామని, ఇందులో భాగంగా ప్రధానిని కలుస్తారని అన్నారు. పార్టీ అధ్యక్షుడి మలిదశ పర్యటనకు కావల్సిన ప్రణాళికలను పార్టీ ప్రతినిధులు రూపొందిస్తున్నారని చెప్పారు. తేదీలు ఖరారు కాగానే ఆ వివరాలను కూడా వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.