ఆంధ్రప్రదేశ్‌

మాట నిలబెట్టుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 4: విద్యుత్ రంగంలో ఆంధ్ర ‘పవర్’ చాటాలని, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపబోనన్న హామీని నిలబెట్టుకున్నానని, తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రంగాలవారీగా భవిష్యత్ విద్యుత్ అవసరాలను అంచనావేసి, అందుకనుగుణంగా సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి విద్యుత్ రంగం కీలకమన్నారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఈనెల 5నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్న నేపథ్యంలో విద్యుత్ మంత్రి కళా వెంకట్రావు, సీనియర్ అధికారులతో సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 2029నాటికి ఆంధ్రను సుస్థిర ఇంధన సామర్ధ్య రాష్ట్రంగా నిలపాలని, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్షించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వేగంగా వృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగానికి, ప్రజా సంక్షేమానికి నాణ్యమైన, అందుబాటు ధరలో ఉండే విద్యుత్తే కీలకమన్నారు. 2018-19కి కరెంట్ ఛార్జీలను ఒక్కపైసా కూడా పెంచనని విజయదశమి సందర్భంగా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) రాష్ట్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని మంత్రి కళా వెంకట్రావు సీఎంకి వివరించారు. వీటిద్వారా 25ఏళ్లపాటు యూనిట్ రూ.3 చొప్పున విద్యుత్ అందిస్తామని ప్రతిపాదించిందని, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం కూడా ఉండదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థలు ‘వికేంద్రీకృత గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ’ను అమలుచేయాలని నిర్ణయించినట్లు ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ విధానంలో లోడ్ సెంటర్ సమీపంలోనే విద్యుదుత్పత్తి జరగడంతో సరఫరా, పంపిణీల్లో నష్టాలు తగ్గుతాయన్నారు. అదే సమయంలో ప్రతి గ్రామం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా వివిధ సబ్ స్టేషన్లలో 1000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి విద్యుత్ సంస్థలు టెండర్లు ఆహ్వానించాయన్నారు. ఈనెల 15కల్లా టెండరు ప్రక్రియ పూర్తిచేసి మార్చి 31 కల్లా రివర్స్ బిడ్డింగ్ పూర్తిచేస్తామని వివరించారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకుని ఏప్రిల్ 15కు ఎల్వోఐ జారీ చేస్తామని అజయ్ జైన్ తెలిపారు.
రాష్ట్రంలో సగటున నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్‌ను వాడే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను బిగించాలని విద్యుత్ సంస్థలు యోచిస్తున్నట్లు అజయ్‌జైన్ సీఎంకు వివరించారు. 10 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో త్వరలోనే డిస్కంలు ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ఈపీడీసీఎల్ పరిధిలో 6లక్షల కనెక్షన్లు, ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 11లక్షల కనెక్షన్లు ఉన్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వానికి చెందిన ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్‌కుమార్ ఈ విషయమై ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. విద్యుత్ రంగ చరిత్రలోనే తొలిసారి పునరుత్పాదక ఇంధన కొనుగోలు లక్ష్యం 4000 మిలియన్ యూనిట్లను దాటిందని అజయ్ జైన్ చెప్పారు. ఇది రూ.400 కోట్లకు పైగా విలువైనదని ఏపీఈఆర్‌సీ విధించిన లక్ష్యానికి మించి జరిగాయని వివరించారు. మార్కెట్‌లో ఆర్‌ఈసీ సర్ట్ఫికేషన్ విక్రయానికి సంబంధించి గుర్తింపు కోసం ఏపీ ట్రాన్స్‌కో కేంద్ర విద్యుత్ నియంత్రణా మండలిని సంప్రదించినట్లు తెలిపారు.
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ (ఏపీఈఆర్‌సీ) ఈనెల 5 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్న నేపధ్యంలో గడచిన మూడేళ్లలో విద్యుత్ రంగంలో సాధించిన లక్ష్యాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి మంత్రి కళాకు సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో వినియోగదారుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ విచారణలు చేపడుతున్న ఏపీఈఆర్‌సీని, ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.్భవానీప్రసాద్‌ను సీఎం అభినందించారు. ఏ రంగానికైనా వినియోగదారులే బాస్‌లని, వారి ఇంటి వద్దకే సేవలను అందించాలని స్పష్టం చేశారు.