రాష్ట్రీయం

333 మంది.. 8 గంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4: ప్రాచీన సాంస్కతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఎనిమిది గంటల పాటు నిర్విరామ శాస్ర్తియ, జానపద నృత్యాలు కోలాహలంగా సాగాయి. రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ‘నృత్య భారతి-రాజమహేంద్రవరం’ పేరిట గిన్నిస్ తెలుగు వరల్డ్ రికార్డు కోసం 333 మంది శాస్ర్తియ నృత్య కళాకారులు విలక్షణ రీతిలో తమ ప్రతిభా కౌశల్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి సౌజన్యంతో భారత్ ఆర్ట్స్ అకాడమి ప్రెసిడెంట్ లయన్ లలితారావు, ఏబీసీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ లయన్ కెవి రమణారావు పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ నాట్యాచార్యుల శిష్యరికం శిక్షణ పొందిన కళాకారులు పాల్గొన్నారు. కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, జానపద నృత్యాలను బృందాలుగా ప్రదర్శించారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన శాస్ర్తియ, జానపద నృత్యాలను భావితరాలకు అందించాలనే తపనతో, ప్రతిభకు కొదవ లేదని నిరూపిస్తూ గిన్నిస్ తెలుగు వరల్డ్ రికార్డ్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఏబీసీ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రమణారావు చెప్పారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ వివిధ ప్రాంతాల్లో వేదికలను అందిస్తూ, భారతీయ కళలను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ఈ సంస్థలు పని చేస్తున్నాయన్నారు. ఇప్పటికి నాలుగేళ్ళుగా కార్యక్రమాలను వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని, గత ఏడాది 510 మందితో అన్నమాచార్య పద నృత్యోత్సవం నిర్వహించామన్నారు. తెలుగు వరల్డ్ రికార్డ్స్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత భాగవతుల మోహనరావు, కూచిపూడి నృత్య కళాకారిణి వసుధ, పసుమర్తి శ్రీనివాస శర్మ, యాంకర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మృతిచెందిన ప్రముఖ నాట్య గురువు వెంపటి రవి శంకర్‌కు కళాకారులు శ్రద్ధాంజలి ఘటించారు.
chitram...
నృత్య ప్రదర్శనలో పాల్గొన్న ఓ బృందం