రాష్ట్రీయం

కుల వృత్తులకు పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: అంతరించిపోతున్న కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని కల్పించనున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సోమవారం సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక శిక్షణ పొందిన నాయా బ్రాహ్మణులకు చెందిన 138 మంది యువతీ, యువకులకు కిట్‌లు, ధృవపత్రాలు అందజేశారు. తెంలగాణ ఉద్యమ ప్రస్థానంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో కుల, చేతి వృత్తిదారుల సమస్యలను ప్రస్తావించారని, అందులో భాగంగా స్వరాష్ట్రంలో వారి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నామని అన్నారు. కుల వృత్తులకు పూర్వవైభవం కల్పించడమే కాకుండా చేతి వృత్తులను కాపాడుకుంటామని మంత్రి అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బలహీన, బడుగు వర్గాల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే నాయా బ్రాహ్మణుల సంక్షేమ కోసం ప్రత్యేకంగా 250 కోట్ల రూపాయిలు కేటాయించామని అన్నారు. నాయాబ్రాహ్మణుల ఆత్మగౌరవంతో బతికేందుకు వారికి ఆధునిక పద్థతుల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని అన్నారు. నాయాబ్రాహ్మణులకు అత్యాధునిక పనిముట్లను అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 3.10 లక్షల మంది నాయా బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, దశల వారీ దానిని అమలుచేస్తామని చెప్పారు. నాయా బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం కోసం 20 కోట్లు కేటాయించామని అన్నారు. శిక్షణ పొందిన 138 మంది నాయాబ్రాహ్మణ యువతీ యువకులు భవిష్యత్‌లో తమ కాళ్లపై నిలదొక్కుకోవాలని చెప్పారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించారని, రానున్న బడ్జెట్‌లో బీసీ వర్గాల బడ్జెట్ రెట్టింపు కానుందని అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ బడ్జెట్ 5070 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ బీసీ బడ్జెట్ కేవలం 1250 కోట్లు మాత్రమేనని విమర్శించారు. బ్యాంకు లింకేజీ లేకుండా అర్హులైన బీసీ వర్గాలకు నేరుగా రుణాలను అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయా బ్రాహ్మణుల ఫెడరేషన్ ఎండి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సహాయ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారుల సంఘం రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

చిత్రం..సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న