రాష్ట్రీయం

జల వివాదాలకు ఇక చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. బడ్జెట్ సమావేశాల్లో నీటి వివాదాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరిన విషయం విధితమే. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలపై తగాదా పడుతున్న రెండు రాష్ట్రాల అధికారులతో ఈ నెల 15న గురువారం కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొని తమ వాదనలు బలంగా వినిపించేందుకు రెండు రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి. కృష్ణా బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాల్లో ఈ నదిపై నిర్మించిన ప్రాజెక్టులను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. దీనివల్ల ఎప్పటికప్పుడు నీటి లభ్యతను బట్టి రెండు రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని పరిమితులకు లోబడి వాడుకునేందుకు వీలుంటుందని ఆంధ్ర ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్ర ప్రభుత్వం, నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాగా గోదావరి జలాలకు సంబంధించి పట్టిసీమ ద్వారా దాదాపు వంద టీఎంసి నీటిని కృష్ణాబేసిన్‌కు మళ్లించడం వల్ల గోదావరి జలాల ఒప్పందం మేరకు ఎగువ రాష్టమ్రైన తమకు నాగార్జునసాగర్‌లో అదనంగా 45 టీఎంసి నీటిని వాడుకునే హక్కు ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఈ వాదనను ఆంధ్రప్రభుత్వం తిప్పిగొడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదని ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలు, టెలిమెట్రీ పరికరాల పనితీరు, పోతిరెడ్డి పాడు ద్వారా ఆంధ్రప్రభుత్వం నీటిని నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ నీటిని మళ్లిస్తోందనే అభియోగాలపై కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో చర్చించనుంది.
ఆంధ్ర, తెలంగాణకు 35 టిఎంసి నీటిని కేటాయించిన కృష్ణాబోర్డు
ప్రస్తుత సంవత్సరంలో లభ్యతలో ఉన్న కృష్ణా జలాల్లో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ 211.64 టిఎంసి, తెలంగాణ 75.61 టిఎంసి నీటిని వినియోగించుకున్నట్లు కృష్ణా బోర్డు పేర్కొంది. కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ 211.64 టిఎంసి నీటిని, తెలంగాణ 75.61 టిఎంసి నీటిని వినియోగించుకున్నాయని కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు మంచినీటికి, సాగునీటి అవసరాలకు 35 టిఎంసి నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఈ జలాలను వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. గత ఏడాది నవంబర్ నెలలో రెండు రాష్ట్రాల అధికారులను కృష్ణాబోర్డు సమావేశపరిచి తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు చేస్తున్నారు. దీని ప్రకారం లభ్యతలో ఉన్న నీటిలో 66 శాతం ఆంధ్ర, 34 శాతం తెలంగాణ వినియోగించుకుంటాయి. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యత 71.31 టిఎంసి. దీనిని పరిగణనలోకి తీసుకుని నీటిని వదలాలని కృష్ణాబోర్డు నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 287.25 టిఎంసిలో ఇంతవరకు ఆంధ్ర 73.68 శాతం, తెలంగాణ 26.32 శాతం నీటిని వినియోగించుకున్నట్లు కృష్ణాబోర్డు అంచనావేసింది. తాజాగా పోతిరెడ్డి పాడుకు 0.5 టిఎంసి, హంద్రీనీవా, ముచ్చుమర్రికి 4 టిఎంసి, నాగార్జునసాగర్ కుడి కాల్వకు 10.50 టిఎంసి, ఎడమ కాల్వకు 2.09 టిఎంసిని విడుదల చేయాలని కృష్ణా బోర్డుత రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కల్వకుర్తికి 2.5 టిఎంసి, 4.4 టిఎంసి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు 11 టిఎంసి నీటిని కేటాయించాలని బోర్డు ఆదేశించింది.ప్రస్తుతం శ్రీశైలంలో 90.98 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 162 టిఎంసి నీటి లభ్యత ఉంది.
*ఇంతవరకు కృష్ణా నీటి వాడకం
ఆంధ్ర 211.64,
తెలంగాణ 75.61 టిఎంసి
*
తాజా కేటాయంపులు
ఆంధ్రకు 17.9,
తెలంగాణకు 17.9 టిఎంసి