రాష్ట్రీయం

వేసవిలో తాగునీటికి కొరత ఉండథు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి వైపు ఉన్న అన్ని గ్రామాల్లో వచ్చే వేసవిలో తాగునీటికి కొరత లేకుండా చూస్తామని మిషన్ భగీరథ వైస్-చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులపై గురువారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఓఆర్‌ఆర్ ఆవల, ఈవల ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ పనులను సమాంతరంగా కొనసాగించాలన్నారు. ఓఆర్‌ఆర్ లోపలివైపు ఉన్న అన్నిగ్రామాలకు వేసవి వరకు తాగునీటిని అందించేందుకు నీటి సరఫరా పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇందుకోసం అవసరమైన సామాగ్రిని యుద్ధప్రాతిపదికన అందిస్తామన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో నీటిసరఫరా మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, ఈడీ సత్యనారాయణ, ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.