రాష్ట్రీయం

ఎన్‌డీఏలో బీజేపీకి సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవీ కృష్ణారెడ్డి
కర్నూలు, ఫిబ్రవరి 8: దేశంలోని 48 రాజకీయ పార్టీలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ఎదురవుతోంది. ఎన్‌డీఏలో కీలకంగా ఉన్న మూడు ప్రధాన పార్టీలైన శివసేన, శిరోమణి అకాళీదల్, తెలుగుదేశం పార్టీలు బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. తన మిత్రపక్షాలతో అవసరం లేనంతగా సొంతబలం ఉన్న బీజేపీ తమను నమ్ముకున్న పార్టీలకు సైతం న్యాయం చేయలేకపోతోందన్న విమర్శను ఎదుర్కొంటోంది. దీంతో జాతీయస్థాయిలో బీజేపీతో స్నేహం చేయడానికి ఇతరపక్షాలు ఇష్టపడవన్న ఆందోళన ఆ పార్టీ పెద్దల్లో కనిపిస్తున్నట్లు రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు. లోక్‌సభలో మొత్తం స్థానాలు 545 కాగా ప్రస్తుతం 537 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎన్‌డీఏ బలం లోక్‌సభ స్పీకర్‌తో కలుపుకుని 333. ఈ సభ్యుల్లో ఎన్‌డీఏలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీకి లోక్‌సభ సభాపతి, ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం 275 మంది సభ్యుల బలం ఉంది. మిత్రపక్షాలైన శివసేన 18, టీడీపీ 16, శిరోమణి అకాళీదల్ 4, లోక్‌జనశక్తి 6, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 4, అప్నాదల్ 3, జెడీయూ 2, ఎన్‌పీఎఫ్ 2, ఎన్‌పీపీ, ఎఐఎన్‌ఆర్, జేకేపీడీపీ, ఎస్‌డీఎఫ్‌లకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. ఎన్‌డీఏలోని ఇతర పార్టీలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా ప్రస్తుతం 239 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎన్‌డీఏ బలం 83 మాత్రమే. ఈ సభ్యుల్లో బీజేపీ 58, టీడీపీ 6, శివసేన 3, అకాళీదల్ 3, జేడీయూ 7, ఎస్‌డీఎఫ్ 1, జేకేపీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. కాగా లోక్‌సభలో సొంత బలం ఉన్న బీజేపీకి రాజ్యసభలో మాత్రం కనీస బలం కూడా లేని విషయం విదితమే. దీని కారణంగా పలు బిల్లుల ఆమోదానికి రాజ్యసభలో బీజేపీ ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక లోక్‌సభలో సొంత బలం ఉన్నా ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తమ మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యనిచ్చారు. అయితే కాలక్రమంలో ఎన్‌డీఏలో బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ శివసేన ఎదురుదాడి ప్రారంభించింది. ఆ పార్టీ తీరుపై శివసేన బహిరంగ విమర్శలు చేస్తున్న విషయాన్ని రాజకీయ విశే్లషకులు గుర్తు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పొందుపర్చిన అంశాలు, ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ చేస్తున్న ఆందోళనకు ఎన్‌డీఏలో మిత్రపక్షమైన శిరోమణి అకాళీదల్ మద్దతునివ్వడంతో బీజేపీకి ఇబ్బంది ఎదురైంది. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ చేస్తున్న ఆందోళన న్యాయమైనదేనని మిత్రులకు కూడా అవసరమైన సహాయం చేయడంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరమని అకాళీదల్ సభ్యులు లోక్‌సభలో పేర్కొనడం గమనించాల్సిన విషయమని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఎన్‌డీఏ ప్రధానపక్షమైన లోక్ జనశక్తి, అప్నాదల్, జేడీయూలు తటస్థంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని వారు తెలిపారు. ఇక పొరుగు రాష్టమ్రైన తెలంగాణలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
సుష్మాస్వరాజ్ చిన్నమ్మను అంటూ ప్రచారం చేసి తాజా బడ్జెట్‌లో తెలంగాణకు తగిన నిధులు ఇవ్వకపోవడాన్ని టీఆర్‌ఎస్ లోక్‌సభలో ప్రస్తావించిందని వెల్లడించారు. దీంతో ఇప్పుడు సొంతబలం ఉన్నా భవిష్యత్తులో మిత్రుల అవసరం ఏర్పడితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీజేపీని ఇరుకునపెడతాయని ఆ పార్టీ వ్యూహకర్తలు పార్టీ అధినేత అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీకి వివరించడంతో పార్టీ సీనియర్ నాయకులు, కేంద్రంలో కీలకమంత్రులైన రాజ్‌నాథ్, అరుణ్‌జైట్లీలతో చర్చించి వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలకు ముగింపు పలకాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత వారు టీడీపీ సభ్యులతో కూడా చర్చించి తొందరలోనే అన్ని సర్దుకుంటాయని సర్దిచెప్పినా ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని, హోదాకు బదులు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఈ సమావేశాల్లోనే చట్టబద్దత కల్పించేంత వరకు తమ ఆందోళన ఆగబోదని తేల్చి చెప్పడంతో బీజేపీ పెద్దలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోందని విశే్లషకులు తెలిపారు. మొత్తం మీద బలం లేని కారణంగా టీడీపీని తక్కువ అంచనా వేసి బీజేపీ ఇరుకున పడిందన్న అభిప్రాయం విశే్లషకుల్లో వ్యక్తమవుతోంది.