రాష్ట్రీయం

సీట్ల పెంపు లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్జాల చంద్రశేఖర్
హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపినట్టే శాసనసభ స్థానాల పెరగుతాయన్న ఆశలపై కూడా చడి చప్పుడు లేకుండా కేంద్రం నీళ్లు చల్లింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 సవరించకుండా శాసనసభ సీట్ల సంఖ్య పెంచడం సాధ్యం కాదని పార్లమెంట్‌లోనే కేంద్రం చావు కబురు చల్లగా చెప్పేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఇరు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెరుగుతాయని ఇటు టిఆర్‌ఎస్, అటు టిడిపి ఆశావాహుల్లో ఆశలు రేపాయి. అయితే 2026 జనాభా లెక్కల సేకరణ వరకు శాసనసభ స్థానాలను పెంచడం సాధ్యం కాదని పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం లిఖితపూర్వకంగా స్పష్టం చేయడంతో అప్పటిదాకా సీట్ల పెంపు లేనట్టేనని తేలిపోయింది. విభజన చట్టం హామీ మేరకు శాసనసభ సీట్లు పెంచకపోయినా ఫర్వాలేదు కానీ బడ్జెట్ కేటాయింపుల్లో అయినా న్యాయం చేసి ఉంటే బాగుండేదని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసారు. శాసనసభ సీట్ల సంఖ్య పెరగడం లేదని మంత్రి కెటిఆర్ పరోక్షంగా ధ్రువీకరించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ సీట్లు 175కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 శాసనసభ సీట్లు 225 పెరగుతాయని ఇరు రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్ర విభజన చట్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సీట్లను పెంచాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వత్తిడి చేస్తూనే వచ్చారు. వీరు ప్రధాన మంత్రితో భేటీ అయిన ప్రతీసారి ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాకు కూడా గతంలో వెల్లడించారు. ఇరు రాష్ట్రాల్లో శాసనసభ సీట్ల పెంపుదలపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే శాసనసభ సీట్లను పెంచడం వల్ల ఇరు రాష్ట్రాల్లో బిజెపికి పెద్దగా ఒరిగేది ఏమిలేదని లెక్కలు వేసుకున్నాకే పార్లమెంట్‌లో కేంద్ర చేతులేత్తిసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున
ఇరు రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా శాసనసభ సీట్లను పెంచడం లేదని ఉప్పు అందించినట్టు సమాచారం. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం శాసనసభ సీట్లను పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ దీనికి ఆర్టికల్ 170 (3)తో పీటముడి పెట్టడం వల్ల ఇప్పట్లో సాధ్యపడదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్టికల్ 170 సవరిస్తే తప్ప సీట్ల సంఖ్య పెంచడం సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణకు రాజ్యసభలో తగిన మెజార్టీ లేదనే ఈ అంశాన్ని పక్కన పెట్టినట్టు ఎన్డీయేకు మిత్రపక్షమైన టిడిపికి, సఖ్యతపక్షమైన టిఆర్‌ఎస్‌కు అంతర్గతంగా ఇప్పటికే కేంద్రం ఉప్పు అందించడం వల్లనే ఇరు రాష్ట్రాల అధినేతలు నోరు మెదపదకపోవడానికి కారణమని టిఆర్‌ఎస్, టిడిపిల అంతర్గత వర్గాల సమాచారం.