రాష్ట్రీయం

విభజన హామీల అమలులో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు సీరియస్‌గా రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్‌తో గురువారం నాడు భేటీ అయ్యారు. ఏపీ విభజన హామీల సాధన కోసం ఐక్య కార్యాచరణ సమితి అవసరమని అభిప్రాయపడిన పవన్ కళ్యాణ్ మేథావులతో దానిని ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఐకాస ఏర్పాటుతో పాటు పార్లమెంటులో ఎంపిల ఆందోళన అంశాలపై జయప్రకాశ్ నారాయణ్‌తో పవన్ చర్చించారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పవన్ ఆరోపించారు. అలాగే పలు అంశాలపై అధికార టీడీపీ నేతలు కూడా భిన్నరకాలుగా స్పందిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరని కూడా ఆయన పరోక్షంగాతప్పుపట్టారు. ఏపీ హక్కుల సాధన కోసం జేఏసీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఇందులో భాగంగానే తొలుత లోక్‌సత్తా అధినేత జెపితో సమావేశమైనట్టు ఆయన పేర్కొన్నారు. కాగా 11వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్టు తెలిసింది.
స్టార్‌గా వెలుగొందుతూ ఎంతో హాయిగా ఉన్న పవన్‌కళ్యాణ్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎంతో సమస్యాత్మకమైన రాజకీయ రంగంలోకి వచ్చారని జెపి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని జెపి అన్నారు. కేంద్రం సకాలంలో స్పందించి తగిన న్యాయం చేయకపోతే ప్రజలు ఏకీకరణ జరుగుతుందని, రాజకీయపక్షాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. హామీలను ఇచ్చి , వాటిపై వెనక్కు పోవడం ఏ విధంగానూ సమంజసం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సైతం కేంద్రం నెరవేర్చాలని జెపి పేర్కొన్నారు. ఆర్ధికాభివృద్ధికి దోహదం చేసే హామీలను నెరవేర్చాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భుండేల్‌ఖండ్‌కు నాలుగు వేల కోట్ల రూపాయిలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజలను రాజకీయ బాధితులను చేయవద్దని జెపి అన్నారు.