రాష్ట్రీయం

రెండు గంటలు.. 200 కిలోమీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 10: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను రోడ్డుమార్గంలో హైద్రాబాద్‌కు తరలించి, మరోవ్యక్తికి ప్రాణం పోసిన నగర పోలీసులు భేష్ అనిపించుకున్నారు. జగిత్యాల జిల్లా కోర్టు మండలం చిన్న మెట్‌పల్లికి చెందిన మేకల నవీన్ కుమార్ (17) ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డాడు. నగరంలోని అపోలోరీచ్ ఆస్పత్రి వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా యువకుడు కోలుకోకపోగా, శుక్రవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయింది. జీవన్‌ధార ట్రస్ట్ నిర్వాహకులు హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలోవున్న వ్యక్తికి గుండెమార్పిడి అవసరం ఉందని, గుండెను హైద్రాబాద్‌కు తరలించేందుకు ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డిని కోరగా, అంగీకరించి అందుకు తగిన ఏర్పాట్లుచేశారు. సిద్ధిపేట, హైద్రాబాద్ పోలీసుల సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించి సమయానికి గుండెను తరలించారు. శనివారం ఉదయం ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి, ఇతర వైద్యనిపులతో ఉదయం 6.50కు ప్రత్యేక వాహనంలో బయలుదేరి ఉదయం 8.50కు గుండెను ఆస్పత్రికి చేర్చారు. దీంతో 47 ఏళ్ళ వ్యక్తికి శస్తచ్రికిత్స విజయవంతమైంది. 200కిమీల దూరాన్ని కేవలం 2గంటల్లోనే చేరుకుని మరో వ్యక్తికి ప్రాణం పోయటంలో సహకరించిన కరీంనగర్ పోలీసులను అపోలో ఆస్పత్రుల చైర్మన్, పలువురు అభినందించారు.