రాష్ట్రీయం

ప్రత్యేక హోదాపై మీ నిర్ణయం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు రాష్ట్రంలో బంద్ చేసినా కేంద్రం వైఖరిలో మార్పు లేదని, వట్టిమాటలు కట్టిపెట్టి హామీలను అమలుచేసేందుకు కృషి చేయాలని టీడీపీ, బీజేపీ పార్టీలను వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని, తన నిర్ణయాన్ని టిడిపి ప్రకటించాలన్నారు. విభజన చట్టంలోని అంశాలను, హామీలను ఎప్పటిలోపు పూర్తి చేస్తారో ప్రజలకు టిడిపి సమాధానం చెప్పాలని ఆయన కోరారు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్‌లో పెట్టిన 17 సంస్థల ఏర్పాటుకు సుమారు రూ.12వేల కోట్లు కావాలని కేంద్ర ఆర్థిక శాఖతోపాటు సంబంధిత శాఖలు తెలిపాయన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్‌ఐటి, ఎయిమ్స్, అగ్రివర్శిటీ, ఎన్‌ఐటిలకు రూ.7200 కోట్లు కావాలన్నారు. నాలుగేళ్లలో కేవలం రూ.626కోట్లు కేటాయించి రూ. 226కోట్లను విడుదల చేశారన్నారు. పదిశాతం కూడా ఇవ్వకపోతే టిడిపి కేంద్రంపై వత్తిడి ఎందుకు తీసుకురావడం లేదన్నారు. ఎన్డీఏలో ఉండి, మంత్రి పదవులను అనుభవిస్తూ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడంలో టిడిపి విఫలమైందన్నారు. విభజన చట్టం అమలుపై ప్రశ్నిస్తే అభివృద్ధినిరోధకులమని ముద్రవేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఒక జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయడంపైన చిత్తశుద్ధి ప్రదర్శించకుండా రోజుకో కథలు అల్లుతున్నారన్నారు.
పోలవరం ఎప్పటిలోపు పూర్తి చేస్తారని నిధులు ఎలలా కేటాయిస్తారనే విషయమై కేంద్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఏపీ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాయనాటకాలు కట్టిపెట్టి తమతో పోరాటానికి సిద్ధంకావాలన్నారు. రాజకీయ అవసరాలను పక్కనపెట్టాలని, సమిష్టిగా కేంద్రంపై పోరాడేందుకు అన్ని పార్టీలు చేతులు కలపాల్సిన అవసరం ఆసన్నమైందని, దీనికి వైకాపా సిద్ధంగా ఉందన్నారు.