రాష్ట్రీయం

విభజన హామీల అమలుకు సంయుక్త నిజనిర్ధారణ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యావేత్తలతోపాటు సామాజికవేత్తలు, రాజకీయ నాయకులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విభజన హామీల అమలు నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలపై విస్తృతంగా చర్చించాలని పవన్‌కళ్యాణ్ సూచించారు.
కవితకు కృతజ్ఞతలు
తెరాస ఎంపీ కల్వకుంట్ల కవితకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లోక్‌సభలో మద్దతు తెలిపిన తెరాస ఎంపీ, చెల్లెలు కవిత గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో నిరసన గళమెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా దీని గురించి లోక్‌సభలో మాట్లాడారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు. ఇదిలా ఉండగా, హామీల విషయంపై కేంద్రం మళ్లీ పాతపాటే చెబుతుండటంతో ఆంధ్రా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.