రాష్ట్రీయం

ప్రముఖ పాత్రికేయుడు వెంకటరామారావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ప్రముఖ విద్యావేత్త, పాత్రికేయుడు జి. వెంకటరామారావు (83) గత రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని లాల్‌దర్వాజలో నివసిస్తున్న వెంకటరామారావుకు గుండెనొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా, తుదిశ్వాస విడిచారు. సోమవారం అంత్యక్రియలు జరిగాయి.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మాధాపురం గ్రామానికి చెందిన వెంకటరామారావు విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లా ఉపవిద్యాశాఖాధికారిగా పనిచేస్తూ 1993 లో పదవీవిరమణ చేశారు. కనక రత్నమ్మ, గోపాలరావుల కుమారుడైన వెంకటరామారావు భార్యపేరు అహల్య. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. వెంకటరామారావు దాదాపు రెండువేల వ్యాసాలు రాశారు. అనేక పుస్తకాలు రాశారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, వార్త, కృష్ణాపత్రిక, ప్రజాతంత్ర దినపత్రికలతో పాటు వివిధ పక్ష, మాసపత్రికల్లో ఆయన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. పరిష్కారం (కథానికల సంపుటి), ఆంధ్రప్రదేశ్ చరిత్రపై నాలుగు గ్రంథాలు, భారతదేశ చరిత్ర ప్రధాన సంఘటనలు తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర, ప్రధానిగా పి.వి, స్వాతంత్య్ర సమర నిర్మాతలు, పులిజాల రంగారావు జీవిత చరిత్ర, నూకల రామచంద్రారెడ్డి జీవిత చరిత్ర, కోదాటి నారాయణరావు జీవిత చరిత్ర, ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర, తరతరాల తెలుగు జాతి చరిత్ర,తెలుగు ప్రముఖులు, సంకీర్ణ ప్రభుత్వాలు తదితర పుస్తకాలు రాశారు. 82 రేడియో ప్రసంగాలు, ఆరు టివి ప్రసంగాలు ప్రసారం అయ్యాయి.
వివిధ సంస్థలు ఆయనను వివిధ సందర్భాలలో సన్మానిస్తూ, పురస్కారాలు అందించాయి. బిఎన్ శాస్ర్తీ ధర్మనిధి పురస్కారం (ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాద్), తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం (జీవిత చరిత్ర రచనారంగం). జైమినీ అకాడమీ పానిపట్ వారి సుభద్రా కుమారీ చౌహాన్ శతజయంతి ఉత్సవ సన్మానం, కృష్ణా జిల్లా ఉత్తమ పాత్రికేయ అవార్డు (2010), గిడుగు పురస్కారం (2013) వెంకటరామారావు అందుకున్నారు.
వెంకటరామారావు మృతిపట్ల బిజెపి నేతలు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎన్.వి. సుభాష్, సుధాకర్ శర్మ వజ్జ ఒక ప్రకటనలో సంతాపం తెలియచేశారు.