రాష్ట్రీయం

అవగాహనతోనే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మహానగరవాసులందరు స్వచ్ఛతపై అవగాహనవంతులై, స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగస్వాములైనపుడే స్వచ్ఛసర్వేక్షణ్‌లో నగరానికి అగ్రస్థానం దక్కుతోందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలో మంత్రి స్వచ్ఛ చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఎవరూ ఊహించని విధంగా 15,320 మంది రికార్డు స్థాయిలో పాల్గొని రోడ్లను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందే మన నగరంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. గత సంవత్సరం 434 మెట్రో సిటీల్లో నిర్వహించిన సర్వేక్షణ్ సర్వేలో నగరానికి 22వ ర్యాంకు వచ్చిందని, ఈసారి నగరవాసులంతా సిటీకి నెంబర్ వన్ ర్యాంకును సాధించటంలో లక్ష్యంగా స్వచ్ఛందంగా ఈ సర్వేలో పాల్గొనాలని సూచించారు. హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు నగరంలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన చైతన్య కార్యక్రమం విజయవంతమైందని అన్నారు.
ఆ తర్వాత డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వచ్ఛ కార్యక్రమాల గురించి వివరించారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, స్వచ్ఛ కార్యక్రమాల పట్ల వారిని ఆకర్షితులను చేసేందుకు జీహెచ్‌ఎంసీ రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే చెత్తను తడి పొడిగా వేర్వేరు చేసి ఇవ్వటంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొని నగరానికి మెరుగైన ర్యాంకును సాధించేందుకు సహకరించాలని సూచించారు. ఈ సంవత్సరం సర్వేక్షణ్ సర్వే దేశవ్యాప్తంగా 4,041 నగరాల్లో జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి జి. వినోద్, స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛ చైతన్య కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన నగర వాసులు