రాష్ట్రీయం

తప్పించుకున్న మావోయిస్ట్ ఆర్కే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 12: మావోయిస్ట్ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే మరోసారి తప్పించుకున్నాడా? పోలీసులకు, మావోయిస్ట్‌లకు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున పెదబయలు, చిత్రకొండ మధ్య జగన్నాథపురం గ్రామం వద్ద సుమారు 50 మంది మావోయిస్ట్‌లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఆంధ్రా, ఒడిశా పోలీసులు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ అక్కడ నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎదురుపడిన వెంటనే మావోయిస్ట్‌లు వారిపై కాల్పులు ప్రారంభించారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. గంటకు పైగా ఈ కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఇందులో ఆర్కేతోపాటు మావోయిస్ట్‌లు తప్పించుకున్నట్టు విశ్వనీయవర్గాల సమాచారం. సుమారు ఏడాది కిందట ఏవోబీలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్కే తీవ్రంగా గాయపడి తప్పించుకున్నాడు. ఆ సమయంలో ఆర్కే కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. మళ్లీ ఇప్పుడు కూడా ఈ ఏవోబీలోనే ఒక సమావేశానికి హాజరై తప్పించుకోవడం గమనార్హం. మావోయిస్ట్‌లు సమావేశమైన ప్రదేశానికి పోలీసులు వెళ్లి పరిశీలించగా, 45 కిట్ బ్యాగ్‌లు, పెద్ద సంఖ్యలో తుపాకులు, బులెట్‌లు లభ్యమ్యాయి. అలాగే పేలుడు పదార్థాలు నింపిన రెండు క్యారేజీలు, ఆరు స్టీల్ క్యారేజీలు, ఏడు జతల ఆలివ్ గ్రీన్ దుస్తులు లభించినట్టు పోలీసులు తెలియచేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోయిస్ట్‌లు ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఎదురుకాల్పుల నుంచి ఆర్కే తప్పించుకున్నాడా? లేదా? అన్నది ఇపుడే చెప్పలేమని అన్నారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన కిట్ బ్యాగ్‌లు రెండు రోజుల్లో విశాఖకు రానుయని, వాటి ఆధారంగా ఏ స్థాయి నాయకులు ఘటనా స్థలంలో ఉన్నారన్నది తెలుస్తుందని ఎస్పీ చెప్పారు.