రాష్ట్రీయం

వచ్చేవి.. కరెంట్ కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలు రాబోతున్నాయని, దీనికి తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు సంస్థాగతంగా సంసిద్ధం కావాలని దక్షిణాది విద్యుత్ సంస్థల సంఘం అధ్యక్షుడు, తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. పాండిచ్చేరిలో 33వ దక్షిణాది విద్యుత్ సంస్థల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కాలుష్యాన్ని బాగా తగ్గించడానికి పర్యావరణ అనుకూల వాహనాల వాడకం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందన్నారు. 2030 నాటికి ప్రజా రవాణా వ్యవస్థలో నూటికి నూరు శాతం, వ్యక్తిగత వాహనాల్లో 40 శాతం విద్యుత్ వాసనాల వినియోగం ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. పెట్రోలు పంపుల మాదిరిగానే వాహనాలకు విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు వస్తాయన్నారు. చార్జింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లతో సంప్రదించి విద్యుత్ వాహనాలకు చార్జింగ్ చేసే ఏజన్సీలను గుర్తించాలన్నారు. వీటికి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించాలన్నారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గునిల్వలు చాలినంత లేవనే విషయాన్ని కేంద్ర విద్యుత్ సంస్థలకు తెలిపామన్నారు. కోల్‌కంపెనీలతో కూడా చర్చిస్తున్నామన్నారు. గ్రిడ్ ఆపరేషన్లను విఘాత పరిచే విధంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, వీటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కీలకమైన విభాగాలు, పరికరాలు నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రిడ్ ఆపరేషన్‌లో క్రమశిక్షణ పాటించడంలో దక్షిణాది రాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయన్నారు.
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంపై సమావేశంలో అన్ని రాష్ట్రాల అధికారులు ప్రశంసించారు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషనన్ డైరెక్టర్ తంగ పాండ్యన్ తన ప్రారంభోపన్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి అనుసరించిన పద్ధతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవులపల్లి ప్రభాకరరావు మాట్లాడుతూ 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు విద్యుత్ అవాంతరాలు లేకుండా ఇచ్చేందుకు 12వేల కోట్లతో పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. భవిష్యత్తులో ఎత్తిపోతల పథకాలకు 11వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. తమ రాష్ట్రంలో 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పరు. సమావేశంలో ఎస్‌ఆర్‌పిపి మెంబర్ సెక్రటరీ ఎస్‌ఆర్ భట్, ఏపి,కర్నాటక, తమిళనాడు, పాండిచ్ఛేరి విద్యుత్ సంస్థల ఎండీలు, విద్యుత్ నిపుణులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకరరావు