రాష్ట్రీయం

అగ్ని..జమదగ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్, ఫిబ్రవరి 20: అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన మధ్యశ్రేణి అగ్ని-2 క్షిపణిని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగలిగే ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. ఐటీఆర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన క్లాంప్లెక్స్-4 నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో పరీక్షించామని పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ క్షిపణిని సైనిక దళాల అమ్ముల పొదిలో చేర్చామని, నేటి పరీక్షను సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ నిర్వహించిందని తెలిపాయి. ఇందుకు సంబంధించిన సాంకేతిక మద్దతును రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అందించిందని పేర్కొన్నాయి. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి బరువు 17 టన్నులు. రెండు వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాన్ని వెయ్యి కిలోల బరువైన అణ్వాయుధాలతో ఛేదించే సామర్థ్యం ఈ అత్యాధునిక క్షిపణికి ఉందని తెలిపాయి. ఈ క్షిపణి పనితీరును నిర్థారించుకునేందుకే తాజా పరీక్ష నిర్వహించామని డీఆర్‌డీఓ శాస్తవ్రేత్త ఒకరు తెలిపారు. ఈ తాజా ప్రయోగాన్ని అన్ని కోణాల్లోనూ లోతుగా పరీక్షించామని, ఇందుకోసం ఆధునిక రాడార్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డీఆర్‌డీఓతో కలిసి అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబరేటరీ అగ్ని-2 క్షిపణిని రూపొందించింది. ఇందులో హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిటిటెడ్ క్రియాశీలక భూమిక పోషించింది. దేశానికి వ్యూహాత్మక రక్షణ కవచాన్ని అందించడంలో భాగంగా వివిధ లక్ష్య పరిధులు కలిగిన అగ్ని సిరీస్ క్షిపణులను ప్రభుత్వం రూపొందిస్తోంది.