రాష్ట్రీయం

తరుముకొస్తున్న నీటి ఎథ్దడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: రెండు తెలుగు రాష్ట్రాలకు రానున్న వేసవిలో మంచి నీటి ఎద్దడి పొంచి ఉంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణలోని నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆంధ్రాలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో వేల సంఖ్యలో గ్రామాలు కృష్ణా నది నీటిపై ఆధారపడి మంచి నీటి స్కీంలను నిర్మించాయి. ప్రస్తుతం కనీస నీటి మట్టం పైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 62 టిఎంసి నీటి లభ్యత ఉంది. ఈ నీటిని వచ్చే ఆరు నెలల పాటు సర్దుకోవాలి. సాధారణంగా గోదావరికి జూన్-జూలై నెలల్లో వరదనీరు వస్తుంది. అదే కృష్ణా నదికి ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, కర్నాటకలో ప్రాజెక్టులు నిండి పరవళ్లు తొక్కిన తర్వాత కాని దిగువకు వరద రాదు. అదృష్టవశాత్తు గత ఏడాది ఆలస్యమైనా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో నిండాయి. ఈ సారి కూడా ఇదే పరిస్థితి. దీంతో నీటిని జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలని కృష్ణాబోర్డు ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలను కోరింది. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను ఏపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 76.14 టిఎంసి నీరు 848 అడగుల నీటి మట్టం వద్ద లభ్యమవుతోంది. దిగువున ఉన్న నాగార్జునసాగర్‌కు 31,506 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లో 521 అడుగుల నీటి మట్టం వద్ద 151.11 టిఎంసి నీటి లభ్యత ఉంది.
ఆగస్టు వరకు రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం లభ్యతలో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల్లో వినియోగించుకోవాలనే అంశంపై త్వరలో బోర్డు విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉందని సాగునీటి ఇంజనీర్లు చెప్పారు. నాగార్జునసాగర్ ఏడమ ఆయకట్టుకు ఖరీఫ్ పంటకు గత ఏడాది నీటిని విడుదల చేయలదు. రబీ సీజన్‌కు నీటిని విడదల చేశారు. ఐదు లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదలచేసశారు. ఇంతవరకు ఏడమ కాల్వ పరిధిలో 25 టిఎంసి నీటిని వినియోగించారు. మరో నెలన్నర వరకు రబీ సీజన్ పూర్తయ్యే వరకు 16 టిఎంసి నీరు అవసరమవుతుంది. హైదరాబాద్ మంచినీటి అవసరాలకు 9 టిఎంసి అవసరమని అంచనా వేశారు. ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు కింద 4 టిఎంసి నీరు కావాలి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద ఏపిలో ఉన్న పంటలకు కూడా 15 టిఎంసి నీటిని విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ నెలాఖరు వరకు కోటాను కృష్ణాబోర్డు విడుదల చేసింది. దీని ప్రకారం 35 టిఎంసినీటిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 510 అడుగులు. అక్కడ 45 టిఎంసి నీటి లభ్యత ఉంటుంది. నీటిని సమర్థంగా వినియోగించుకునే పద్ధతులను అమలు చేయని పక్షంలో రబీ సీజన్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిని సారించాయి. తమ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు వచ్చే వేసవి దృష్ట్యా ప్రత్యామ్నాయ మంచినీటి సరఫరాపై ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించాయి.