ఆంధ్రప్రదేశ్‌

ఆపరేషన్ ఆకర్ష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో పోయిన పరువును కాపాడుకునేందుకు ఆంధ్రాలో ఆపరేషన్ ఆకర్ష్‌కు టిడిపి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు సరికదా బెడిసి కొట్టాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోవడం, ఎమ్మెల్యేలు వరుసపెట్టి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివ్వెర పోతున్నారు. దీంతో కొంత మంది మంత్రులు రంగంలోకి దిగి కొంత మంది వైకాపా ఎమ్మెల్యేలకు ఎరవేసి పార్టీలోకి తెస్తే ఆధిపత్యం నిలబెట్టుకున్నట్లవుతుందని, ఆంధ్రాలో టిడిపి బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చినట్లవుతుందని భావించారు. కాని ఈ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కొసమెరుపేమిటంటే, టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఒక ప్రకటనలో తమ పార్టీలో చేరేందుకు వైకాపా ఎమ్మెల్యేలు సంప్రదించారని, ఇది వాస్తవమన్నారు.
విజయవాడలో గురువారం వైకాపా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సిఎం చంద్రబాబుతో దాదాపు 3 గంటల సేపు సమావేశమయ్యారు. దీంతో జలీల్ ఖాన్ టిడిపిలో చేరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. టిడిపి నుంచి ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కూడా శాసనసభలో లేనందు వల్ల జలీల్ ఖాన్‌ను చేర్చుకోవాలని టిడిపి తాపత్రయపడుతోంది. చంద్రబాబును కలిసిన తర్వాత జలీల్ ఖాన్ విలేఖర్లతో మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసమే సిఎంను కలిశానని, అంతమాత్రాన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు కాదన్నారు. చివరి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొంత మంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. తీరా ఆ ఎమ్మెల్యేలు సంతమాగులూరులో విలేఖర్లతో మాట్లాడుతూ తాము జగన్ వెంట నడుస్తామని స్పష్టం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ఎం అశోక్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు, జంకే వెంకటరెడ్డి, ఏ సురేష్ సంతమాగులూరులో విలేఖర్లతో మాట్లాడుతూ టిడిపిలో చేరే ప్రసక్తిలేదన్నారు. తెలంగాణలో పార్టీ ఖాళీ అయిన విషయాన్ని దృష్టి మళ్లించేందుకు టిడిపి నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాము జగన్ వెంట ఉంటామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడని, చివరి శ్వాస వరకు వైకాపాలో ఉంటానన్నారు. భవిష్యత్తు కావాలనుకునే వారు వైకాపాను వీడరన్నారు. నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావువిజయవాడలో మాట్లాడుతూ నిలువెత్తు డబ్బు పోసినా తాను టిడిపిలో చేరే ప్రసక్తిలేదన్నారు. చివరి వరకు వైకాపాలో ఉంటానన్నారు. టిడిపి మునిగిపోయే పడవ అన్నారు. కడప జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే జి శ్రీకాంత రెడ్డి మాట్లాడుతూ మునిగే నావలో ఎవరూ ఎక్కరని, తెలంగాణలో టిడిపి ప్రజల దృష్టిపడకుండా ఉండేందుకు చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నరన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో తమ సంకల్పం చెదిరిపోదన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు వైకాపాలో ఉంటానని పేర్కొన్నారు. తాను టిడిపిలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.
టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో భాగస్వాములవుతామని ఎవరు వచ్చినా టిడిపి స్వాగతిస్తుందని, వైకాపా కుప్పిగంతులు మానుకోవాలన్నారు. జగన్ వైఖరిని వైకాపా నేతలే తప్పుబడుతున్నారన్నారు. గౌరవ ప్రదమైన రాజకీయాలు చేసే నాయకులెవరూ వైకాపాలో ఉండే పరిస్ధితి లేదన్నారు. 33 సంవత్సరాల్లో ఎన్నోసార్లు కిందపడ్డా టిడిపి నిలదొక్కుకుందన్నారు.