రాష్ట్రీయం

అవకాశాలు అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్న నవ్యాంధ్రలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో శనివారం ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు ప్రధాన వేదికపై సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ ప్లీనరీలో ఆయన కీలక ప్రసంగం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తరుణంలో రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విజన్‌తో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా తదితర రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడున్నరేళ్ల కాలంలో నవ్యాంధ్ర రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసుకుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ముందుందన్నారు. దేశంలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఉందన్నారు. పర్యావరణ హితమైన సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో అద్భుత ప్రగతి సాధించామన్నారు. ప్రస్తుతం దేశంలో 3 శాతం సరఫరా నష్టాలతో విద్యుత్ రంగం అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. సుస్థిర సమాజ స్థాపన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాన్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లతో పాటు రోడ్డు, జల, వాయు మార్గాల్లో వౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి సాధించేందుకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు స్తున్నాయన్నారు. ముఖ్యంగా గత రెండేళ్లలో 29 నుంచి 38 శాతం లోటు వర్షపాతం నమోదైనప్పటికీ సమర్ధవంతమైన నీటి యాజమాన్య విధానాలతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 100 నగరాలను ఆర్థిక నగరాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు సింగపూర్ కంపెనీతో అవగాహన కుదిరిందన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు భరోసా కల్పించే సమర్ధవంతమైన ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో పారదర్శక పారిశ్రామిక పాలసీ పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తోందన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు కంట్రీ డైరెక్టర్ కెంచి యోకోయామ మాట్లాడుతూ విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌తో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్నారు. మేజర్ పోర్టులు, విమానాశ్రయాలు, రహదారి సౌకర్యాలు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.45వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ మార్కెట్‌కు గేట్‌వేగా ఘనత సాధిస్తుందన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ మాట్లాడుతూ ఏపీలో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు.
చిత్రం..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రగతిని వివరిస్తున్న సీఎం చంద్రబాబు