రాష్ట్రీయం

జలవనరుల అభివృద్ధికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర అభివృద్ధికి నీరు ప్రధాన ఆధారంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధికి పెద్దపీట వేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భూగర్భ జలాల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు గాను ఫిజో మీటర్లను ఏర్పాటుచేసి పర్యవేక్షించటం జరుగుతుందన్నారు. 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 10.5 లక్షల ఎకరాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇదంతా ఉపరితలంలోని వాన నీటిని భూగర్భంలోకి ఇంకింపచేయటంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయటం వలనే సాధ్యమవుతోందన్నారు.
ఉపరితల, భూగర్భ నీటివనరుల సమన్వయం వినియోగంపై స్థానిక సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో రెండురోజులపాటు జరుగనున్న జాతీయ సదస్సును మంత్రి దేవినేని ఉమ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు తమ శాఖ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. నీరు-చెట్టు పథకం నుంచి 1500 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించామన్నారు. ఈ మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాలకు మళ్లించుకున్నారన్నారు. దీనివలన రాయలసీమ జిల్లాలోని చెరువులు పూర్తి సామర్థ్యంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండాయన్నారు. ఫలితంగా భూగర్భ జలాలు మెరుగుపడ్డాయన్నారు.
గత ఏడాది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణానదికి రావాల్సిన 700 టిఎంసిల నీటి ప్రవాహం 66 టిఎంసిలకు తగ్గిందన్నారు. అయితే నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే సముద్రంలో వృథాగా పోతున్న గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 8.92 టిఎంసిల కృష్ణాకు తరలించటం వలన కృష్ణాడెల్టాలోని 8.5 లక్షల ఎకరాల్లోని 2400 కోట్ల విలువైన పంటను కాపాడగలిగామన్నారు. పైగా కుడి ప్రధాన కాలువ పరిసరాల్లో ఈ నీటి ప్రవాహం వలన భూగర్భ జలాలు 3 నుంచి 8 అడుగుల మేర పెరిగాయన్నారు. కేవలం 170 రోజుల్లో పట్టిసీమ పథకాన్ని పూర్తిచేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఫారం పాండ్లను రైతుల పొలాల్లో నిర్మిస్తున్నట్లు రైతులు తెలిపారు. రెయిన్ గన్స్‌ను వినియోగించి వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఆ పొలంలోనే పంటకు తడులిచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఎపి నీటిరంగ అభివృద్ధి పథకం ప్రాజెక్టు డైరక్టర్ వి.వెంకట్రామయ్య, జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రవికుమార్, భూగర్భ జలవనరులశాఖ డెప్యూటీ డైరక్టర్ ఎ.వరప్రసాద్, నీటిపారుదల సంఘం సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, ప్రముఖ ఇంజనీర్లు చెరుకూరి వీరయ్యచౌదరి, డాక్టర్ అమర్‌సింగే, తదితరులు ప్రసంగించారు.