రాష్ట్రీయం

భళా.. భాగస్వామ్య సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: విశాఖలో వరుసగా మూడోసారి మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సు సోమవారంతో ముగిసింది. సదస్సులో లక్ష్యానికి మించి పెట్టుబడులు రావడంతో సీఎం చంద్రబాబు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. గతంలో జరిగిన భాగస్వామ్య సదస్సులకు భిన్నంగా సదస్సు జరిగింది. రాష్ట్రంలో ఏయే రంగాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నది పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు ప్రత్యేకించి స్టేట్ సెషన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందుంచడమే దీని లక్ష్యం. మరోపక్క దేశ, విదేశీ ప్రతినిధులతో చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంతేకాదు చిత్తశుద్ధితో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. సదస్సులో మన దేశానికి చెందిన అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ భారీ పెట్టుబడలతో ముందుకు వచ్చారు. మూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంతో ప్రారంభించిన సదస్సులో అంచనాలకు మించి 4.39 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నారు. మూడు రోజుల సదస్సులో మొత్తం 734 ఎంఓయూలు జరిగాయి. 4.39 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా 11 లక్షల మందికి ఉపాధి లభించనుంది.
రంగాలవారీగా పెట్టుబడులు
ఈడీబీలో 144 ఎంఓయూలు జరిగాయి. ఇందులో 1,51,400 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారు. ఈ రంగంలో 1,52,496 మందికి ఉపాధి
లభించనుంది. ఎన్‌ఆర్‌ఇడీసీడీఏ రంగంలో 38 ఎంఓయూల ద్వారా 78,935 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టారు. ఈ రంగంలో 24,411 మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమల రంగంలో 129 ఎంఓయూల ద్వారా 58,337 కోట్ల పెట్టుబడులు రాబట్టారు. ఇందులో 1,31,682 మందికి ఉపాధి లభించనుంది. సీఆర్‌డీఏలో 37 ఎంఓయూల ద్వారా 49,643 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టారు. ఇందులో 78,680 మందికి ఉపాధి లభించనుంది. పెట్టుబడులు, వౌలికసదుపాయాల రంగంలో 22 ఎంఓయూల ద్వారా 45,981 కోట్ల పెట్టుబడులు రాబట్టారు ఇందులో 3,86,200 మందికి ఉపాధి లభించనుంది. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో 75 ఎంఓయూల ద్వారా 30,050 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ఇందులో 1,30,343 మందికి ఉపాధి లభించనుంది. గనుల శాఖలో 31 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 12,227 కోట్ల రూపాయల పెట్టుబడులు, 16,225 మందికి ఉద్యోగాలు రానున్నాయి. పర్యాటక రంగంలో 49 ఎంఓయూల ద్వారా 5,002 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 30,338 మందికి ఉఫాధి లభించనుంది. హెల్త్ అండ్ మెడికల్ రంగంలో కుదిరిన 25 ఒప్పందాల ద్వారా 5,090 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇందులో 4,750 మందికి ఉపాధి లభించనుంది. ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో 165 ఒప్పందాలు జరిగాయి.3,100 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 47 వేల మందికి ఉపాధి లభించనుంది. ఏపీఎస్‌ఎస్‌డీసీలో 19 ఎంఓయూలు జరిగాయి. ఇందులో లక్ష మందికి ఉద్యోగాలు రానున్నాయి.

చిత్రం..సింగపూర్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు