రాష్ట్రీయం

ఏప్రిల్ 22నుంచి ఏపీ ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 26: ఏపీ ఎమ్సెట్‌ను ఏప్రిల్ 22నుంచి నిర్వహిస్తున్నామని కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు వెల్లడించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏపీ ఎమ్సెట్ -2018 పరీక్ష నిర్వహణను కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) వరుసగా నాల్గవసారీ కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) పద్ధతిలో నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2018-19 విద్యాసంవత్సరానికి బీటెక్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మా డి కోర్సుల ప్రవేశ పరీక్షకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 28 నుంచి ఆన్‌లైన్ విధానంలో ఎమ్సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు చెల్లింపు, సిలబస్, ఇతర వివరాలను వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులకు యూజర్ గైడ్‌లో పొందుపర్చారు. ఆన్‌లైన్ దరఖాస్తులో ప్రతి విద్యార్థి మూడు రీజినల్ సెంటర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి ప్రాధాన్యతను బట్టి ఎంపిక చేసుకున్న మూడింటిలో ఒక పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 18 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ పరీక్షను ఏప్రిల్ 22నుంచి 25 వరకు నిర్వహిస్తారు. అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి
సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. ఉర్దూ అనువాదం కావలసిన విద్యార్థులకు కర్నూలులో మాత్రమే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఆన్‌లైన్ విధానంతో పారదర్శకంగా పరీక్ష నిర్వహించడమేకాక, త్వరితగతిన ర్యాంకులు కేటాయించడానికి వీలవుతుందన్నారు. ప్రవేశ పరీక్షను రాష్ట్రంలోనే కాక, తెలంగాణ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్‌లో ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహిస్తామని వివరించారు. ఎమ్సెట్-18కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి విద్యార్థులు 0884-2340535, 2356255 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు సూచించారు. గతంలో ఎమ్సెట్ కన్వీనర్‌గా సమర్ధవంతంగా పనిచేసిన డాక్టర్ సాయిబాబు మరోసారి ఏపీ సెంట్‌కు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చిత్రం..ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సాయిబాబు