రాష్ట్రీయం

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో రాష్ట్రం వాటా 80 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటాను 80 శాతానికి పెంచుతామని సీఎం చంద్ర బాబు అన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు చివరి రోజు సోమవారం ఏపీ ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రోత్సహంపై ప్రత్యక్ష సదస్సు జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటా ప్రస్తుతం 20 శాతంమేర ఉందని, దీన్ని రానున్న కాలం లో 80 శాతానికి పెంచుతామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. దేశ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఏపీ వాటాన్ని అనూహ్యంగా పెంచేందుకు నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులు, ప్రోత్సాహక వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కేంద్ర బిందువుగా ఏపీని ఉంచేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుదారులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలన్నారు. నేడు వ్యక్తిగత మరుగుదొడ్లులేని వారున్నారని, అయితే సెల్‌ఫోన్లు లేకుండా ఎవరూ లేరన్నారు. ఒక స్మార్ట్ఫోన్ ఉంటే ఏ పనైనా ఉన్నచోట నుండే చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్ర పరిపాలనలో కూడా ఇంటర్నెట్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్‌ను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు. ఏటా 400 మిలియన్ డాలర్ల హార్డ్‌వేర్ ఉత్పత్తులను దేశం దిగుమతి చేసుకుంటుందన్నారు. ఈ విధంగా దేశంలోనే హార్డ్‌వేర్ ఉత్పత్తులు పెంచేందుకు జరుగుతున్న కృషిలో ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో సెల్‌ఫోన్లు, సెట్‌టాప్ బాక్స్‌లు, వాషింగ్‌మిషన్లు తదితర పరిశ్రమలను ప్రోత్సహిస్తూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సులువుగా అనుమతులు జారీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం కోరారు. ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ‘మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఏపీ’గా అభివృద్ధి చెందాలన్నారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రానిక్ రంగానిదేనన్నారు. అన్నిరంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తున్న ఏపీ ఎలక్ట్రానిక్స్ రంగంలోను ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న పలువురు పారిశ్రామికవేత్తలు వ్యక్తంచేసిన సందేహాలను ఐటీ మంత్రి లోకేష్ నివృత్తి చేశారు. 30,100 కోట్ల మేర పెట్టుబడులతో లక్షా 30వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమల స్థాపనకు 81 సంస్థలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పంద పత్రాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో పెట్టుబడిదారులు పరస్పరం అందించుకున్నారు. ఫాక్స్‌కాన్ ఎండీ జోష్, విస్టాన్ సంస్థ డైరెక్టర్ గురురాజ్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.