రాష్ట్రీయం

భయం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఆంధ్రలో పెట్టుబడులకు సంకోచం అవసరం లేదని, మీ పెట్టుబడులకు నాదీ హామీ అని పారిశ్రామికవేత్తలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ భరోసానిచ్చారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా నరసింహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే, తమ డబ్బు ఏమవుతుందోనని చాలా మంది భయపడతారు కానీ మిషన్.. విజన్.. ఎగ్జిక్యూషన్‌ను సమర్థవంతంగా చేయగలిన నాయకుడు చంద్రబాబు ఉన్న రాష్ట్రంలో అటువంటి భయాలకు తావులేదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ స్థానంలో ఉందన్నారు. ప్రజల్లో సంతోషాన్ని చూడాలన్నది ఆయన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి ఇటువంటి సదస్సులు జరగడం ముదావహమంటూ, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందన్నారు. 2022 నాటికి మనం సరికొత్త ఆంధ్రను చూడగలుగుతామని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో రోడ్, రైల్, ఎయర్ పోర్టు కనెక్టివిటీ సమృద్ధిగా ఉందని, పెట్టుబడిదారులు కోరుకునే వౌలిక సదుపాయాలన్నీ రాష్ట్రంలో ఉన్నట్టేనన్నారు. ఇక్కడికి వచ్చే పెట్టుబడిదారులతో అధికారులు స్నేహపూర్వకంగా మెలుగుతున్నారని, ఇది రాష్ట్భ్రావృద్థికి ఎంతో దోహదపడుతుందన్నారు. అన్నింటికీ మించి దేశంలో సహజసిద్ధమై నిఘా వ్యవస్థ ఉందని దీనివలన పారిశ్రామికవేత్తలు సురక్షిత వాతావరణంలో ఇక్కడ ఉండచ్చని అన్నారు. ‘వికాస్ కా నారా... ఆంధ్రప్రదేశ్ హమారా.. అని గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు కలలు కంటూ వాటిని నిజం చేసుకుంటున్నారన్నారు. భవిష్యత్‌లో పరిశ్రమలన్నీ ఏపీకే తరలి రానున్నాయన్నారు.
మారిషస్ ఉపాధ్యక్షుడు పరమశివం పిళ్లై మాట్లాడుతూ చంద్రబాబును మారిషస్‌కు ఆహ్వానించాలని ఇక్కడికి వచ్చానని, అంతేకాకుండా ఏపీతో అనేక ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. బీహార్, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో మారిషస్ ప్రజానీకం విస్తరించి ఉన్నారన్నారు. సింగపూర్ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ సింగపూర్, ఆంధ్రల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేకం జరిగాయన్నారు. అలాగే భారతలో సింగపూర్ కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అమరావతి అనతికాలంలోనే అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందుతుందని ఈశ్వరన్ అన్నారు. సీఐఐ డైరక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఐఐ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమరావతిలో స్టార్టప్ సెంటర్లను పెద్దఎత్తున నెలకొల్పనున్నామన్నారు. ఇక్కడై సీఐఐ కేంద్ర కార్యాలయాన్ని కూడా నెలకొల్పనున్నామని చెప్పారు. అదేవిధంగా అమరావతిలో ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌ను. ఫిన్‌టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్