రాష్ట్రీయం

రైల్వే మెగా రిక్రూట్‌మెంట్‌లో పలు మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: భారతీయ రైల్వే నాలుగేళ్ల తర్వాత ప్రకటించిన మెగా రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు విధానాన్ని కొంత సులభతరం చేసినట్లు రైల్వే ప్రకటించింది. గ్రూప్-సి, లెవెల్ 1, 2 కేటగిరీల్లో 89,409 ఖాళీల భర్తీకి మెగా నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 3న ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఈ భారీ రిక్రూట్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్ ఉద్యోగాలకు వయోపరిమితిని అన్ని కేటగిరీల అభ్యర్థులకు రెండేళ్లు పెంచింది. అలాగే లెవెల్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారికి కూడా రెండేళ్ల వయోపరిమితిని పెంచింది. ఫీజు మినహాయింపు లేనివారికి వెసులుబాటుగా ప్రస్తుతం చెల్లిస్తున్న పరీక్ష ఫీజు రూ.500 నుంచి రూ.100 కుదించింది. మిగిలిన రూ.400 తిరిగి చెల్లిస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. ఒకసారి ఫీజు చెల్లిస్తే తిరిగి చెల్లించే అవకాశం గతంలో లేదు. ప్రస్తుతం పరీక్షకు ఎవరైతే హాజరవుతారో వారికి మాత్రమే రూ.400 మొత్తం ఆన్‌లైన్‌లో పరీక్ష తర్వాత అభ్యర్థి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. అందుకు వీలుగా అభ్యర్థి ఆన్‌లైన్‌లో తన బ్యాంకు ఖాతా వివరాలను రైల్వే శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఫీజు మినహాయింపు పొందిన ఎస్‌సి, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీల అభ్యర్థులు మాత్రం రూ.250 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే 15 భాషల్లో పరీక్ష రాసుకునే అవకాశం కూడా కల్పించింది. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు భాషల్లో పరీక్ష రాసుకునే అవకాశం అభ్యర్థులకు కల్పించబడింది. ఇప్పుడు ఉన్న హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే అభ్యర్థి సంతకం చేయాలన్న నిబంధనను సైతం సడలించారు. అభ్యర్థి ఏ భాషలోనైనా సంతకం చేసుకునే వీలు కల్పించబడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ మార్చి 31గా రైల్వే శాఖ ప్రకటించింది.