రాష్ట్రీయం

కలెక్టరేట్ ముట్టడి భగ్నం..అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 26: హైకోర్టు రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా సోమవారం అనంతపురంలో న్యాయవాదులు కదం తొక్కారు. హైకోర్టు సాధన సమితి-న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణ నుంచి న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. వీరికి సంఘీభావంగా సీపీఎం, బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో ‘రాయలసీమకు న్యాయం చేయాలని, రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి..’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్తున్న న్యాయవాదులను పోలీసులు మధ్యలోనే అరెస్టుచేసి వన్ టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ హైకోర్టు రాయలసీమ హక్కు అని, దానిని సాధించేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కొందరు న్యాయవాదులను కలెక్టరేట్‌లోకి అనుతించగా, బీజేపీ, సీపీఎం నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ టీ.రమామణికి వినతిపత్రం సమర్పించారు.