రాష్ట్రీయం

రేపటి నుంచి శాతవాహన పదో ప్లాట్‌ఫారం నుంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఫిబ్రవరి 27: మార్చి ఒకటో తేదీ నుండి విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఆరు నుండి కాకుండా 10వ ప్లాట్‌ఫారం నుండి బయలుదేరుతుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 45 రోజుల పాటు ఇదే ప్లాట్‌ఫారం నుంచి బయలుదేరుతుందని తెలిపారు.

రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలి
మార్చి నెల ఆరంభం కాకుండానే సూర్య భగవానుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. అయితే విజయవాడ స్టేషన్‌లో ప్రయాణికులు వెళ్లవలసిన రైలు కోసం వేచి ఉండేందుకు తగిన సదుపాయాలు లేకుండాపోయాయి. బయట ప్లాట్‌ఫారంపై ఏర్పాటు చేసిన కుర్చీలు, బల్లలకు సమీపంలోని ఫ్యాన్‌లు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు వేచి ఉన్న ప్రదేశంలో ఫ్యాన్‌లు తిరగకపోగా కూర్చోడానికి కనీస వసతులు లేవని వాపోతున్నారు. ఈ విషయంలో స్టేషన్ అధికారులు, డివిజన్ అధికారులు కలగజేసుకుని కూర్చోడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.