రాష్ట్రీయం

పట్టణాల్లో ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 2: స్థల సమస్య తలెత్తకుండా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచి నిరంతర విద్యుత్ సరఫరాకు పట్టణ ప్రాంతాల్లో ఇండోర్ సబ్‌స్టేషన్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్నిచోట్ల ఇప్పటికే వీటిని ఏర్పాటు చేసింది కూడా. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతోన్న విశాఖలో గజం స్థలం లభించడం ప్రస్తుతం పెద్ద సవాల్. కోట్లాది రూపాయల విలువైన భూములు విద్యుత్‌శాఖకు ఇచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. అటు ప్రభుత్వ స్థలాలు, ఇటు ప్రైవేటు స్థలాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. దీంతో వృథాగా ఉండే కొద్దిపాటి ఖాళీ స్థలాలను గుర్తిస్తున్న ఈపీడీసీఎల్ యాజమాన్యం వాటిలోనే ఇండోర్ సబ్‌స్టేషన్లను నిర్మించే ఆలోచన చేపట్టింది. ఒక్క విశాఖలోనే దాదాపు 15 ఇండోర్ సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే తరహాలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లో ఇండోర్ సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇండోర్ సబ్‌స్టేషన్లతో నిర్వహణ ఖర్చు, విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవచ్చని అంచనా. మొత్తం ఐదు జిల్లాల పరిధిలో ఉన్న వినియోగదారుల కోసం 400 కేవీ సబ్‌స్టేషన్లు రెండు, 220 కేవీ సబ్‌స్టేషన్లు 17, 132 కేవీ సబ్‌స్టేషన్లు 61 అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే 33/11కేవీ సబ్‌స్టేషన్లు 739, మరో 220 కేవీ ఫీడర్లు 30, 132 కేవీ ఫీడర్లు 153, 33కేవీ ఫీడర్లు 424, 11కేవీ ఫీడర్లు 3057 ఉన్నాయి. వీటితోపాటు ముఖ్యమైన పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 1096, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 1,84,202 ఏర్పాటయ్యాయి. ఇవికాకుండా సంస్థ పరిధిలో 33కేవీ లైన్లు ఏకంగా 6052 కిలోమీటర్లు, 11కేవీ లైన్లు 45,265 కిలోమీటర్లు, ఎల్‌టీ లైన్లు 81,489 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఈ విధంగా విద్యుత్ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి పటిష్టపరుస్తోన్న సంస్థ యాజమాన్యం ఇపుడు ముఖ్యమైన పట్టణాల్లో తక్కువ స్థలాల్లో ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.