రాష్ట్రీయం

మత్తయ్యకు ఏసీబీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మళ్లీ కదిలింది. కేసులో నాల్గవ నిందితుగా ఉన్న జెరూసలేం మత్తయ్య వారంలోగా ఏసిబి కార్యాలయానికి వచ్చి వాంగ్మూలమివ్వాలంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ శనివారం నోటీసులు జారీ చేశారు. వీలైనంత త్వరలో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసి కోర్టు ద్వారా అనుమానితులకు సమన్లు చేసే దిశగా ఏసిబి న్యాయ ప్రక్రియ చేపట్టనుంది. ఆంధ్ర సిఎం చంద్రబాబుకు కోర్టు ద్వారానే సమన్లు జారీ చేయించాలనే నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారించాలంటే గవర్నర్ అనుమతి అవసరమవుతుందని, దీనివల్ల జాప్యం జరగడమేకాకుండా, రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
శనివారం ఉప్పల్‌లో ఉంటున్న మత్తయ్య ఇంటికి వెళ్లి ఏసిబి అధికారులు తాఖీదు ఇచ్చారు. సిఆర్‌పిసి సెక్షన్ 160కింద నోటీసులిచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఏసీబీ దర్యాప్తు కార్యాలయానికి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా వచ్చే వారం రోజుల్లో ఒకరోజు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ చేస్తామని స్పష్టం చేశారు. మత్తయ్య అరెస్టుపై హైకోర్టు స్టే ఇచ్చినందువల్ల అరెస్టు చేయబోమని కూడా ఏసిబి పేర్కొంది. కాగా కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, తనపై ఉన్న అభియోగాల్లో వాస్తవం లేదంటూ మత్తయ్య గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. కేసును విచారించిన హైకోర్టు మత్తయ్య అరెస్టుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో తనను ఏవిధంగా విచారణకు రావాలని ఏసిబి నోటీసు ఇస్తుందని మత్తయ్య శనివారం మీడియా వద్ద ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వం దళిత క్రైస్తవులను వేధిస్తోందని, దీనికి తన కేసు ఉదాహరణ అని అన్నారు. కాగా కేసులో నగరానికి చెందిన తెదేపా ఎమ్మెల్యే గోపినాథ్ ప్రమేయం ఉందనే అభియోగాలపైనా ఎసిబి దర్యాప్తును ముమ్మరం చేసింది. గత ఏడాది మే 30న ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెనసన్‌ను తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ తెదేపా ఎమ్మెల్యే రూ.50 లక్షలను ఆఫర్ చేస్తుంటే ఎసిబి పోలీసులు వలపన్ని పట్టుకున్న సంగతి విదితమే. ఈ కేసులో ఇంతవరకు తెదేపా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెభాష్టియన్, ఉదయ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేయగా, వారు బెయిల్‌పై విడుదలయ్యారు. కేసుపై గత ఏడాది జూలై 28న ఎసిబి పోలీసులు 25 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. చార్జిషీటును ఏసిబి కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. మొత్తం కేసులో రూ.50 లక్షలను సమకూర్చినదెవరు? అనే అంశంపై ఇప్పటికే ఏసీబీ కీలకమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం.