రాష్ట్రీయం

ఏజెన్సీలో యుద్ధ వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం (నూగూరు), మార్చి 2: తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో గిరిజన గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసు బూట్ల చప్పట్లతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు భీతిల్లుతున్నారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయనే కోణంలో పేరూరు, వాజేడు, వెంకటాపురం, చర్ల తదితర పోలీసు స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వెంకటాపురం సీఐ రవీందర్, ఎస్‌ఐ బండారి కుమార్‌తో పాటు ప్రత్యేక బలగాల మోహరింపులో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో ముందస్తు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన కొండలపై ఉన్న ఆదివాసీ గ్రామాలైన డోలీ, తడపల, పాతాల, తామునూరు అనేక గిరిజన కుగ్రామాలకు కొండ జాతి గిరిజనులు రాకపోకలు సాగించేందుకు 1974లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ ద్వారా కొండలు ఎక్కేందుకు ఇనుప నిచ్చెన ఏర్పాటుచేశారు. ఇనుప నిచ్చెన ద్వారా కొండలపై నివసించే గిరిజనులు కిందకు దిగి సుమారు 15 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చే వారు. కాగా నిచ్చెనతో సులువుగా రాకపోకలు సాగించారు. గ్రామాల్లోని ఆదివాసీలు కొండలు దిగి కిందికి రాగా, గుత్తికోయలు, ఆదివాసీలు, గ్రామాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారు.
మందుపాతరలపై ప్రత్యేక నిఘా
ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులను ఎదురుదెబ్బ తీసేందుకు మందు పాతరలు పేల్చేందుకు మావోయిస్టులు వ్యూహం పనే్నందుకు అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
టవర్ పేల్చివేసి ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేసి పోలీసులకు సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేశారు. అడవుల్లో ఆకురాల్చు కారణంగా దూర ప్రాంతంలో ఉన్న కూంబింగ్ దళాలు, మావోయిస్టుల కదలికలు కనుగొనే నేపథ్యంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలిసింది.