రాష్ట్రీయం

హైకోర్టు కోసం ‘అనంత’లో హైవే దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 2: హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా అనంతపురంలో న్యాయవాదులు శుక్రవారం జాతీయ రహదారిని దిగ్బంధించారు. న్యాయవాదులకు సంఘీభావం ప్రకటిస్తూ ఆందోళనలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, విద్యార్థిసంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎస్‌ఐ, రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు తపోవనంలోని జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి, 4వ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆందోళనలో న్యాయవాదులు భరత్‌భూషన్‌రెడ్డి, రాచమల్లు హరినాథ్‌రెడ్డి, ఐ.రవీంద్ర, గడియారం మల్లికార్జునశర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం ఉత్తర జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అనంతపురంలో జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న న్యాయవాదులు, వివిధ పార్టీల నాయకులు