రాష్ట్రీయం

వేదాలను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 2: వేదం మనస్సుకు అలౌకిక ఆనందాన్ని ఇస్తుందని, స్వామివారి దర్శనానికి ఎంతగా శ్రమిస్తామో, వేదం శ్రవణం చేయడానికి అంతగా శ్రమించాలని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సూచించారు. ఉజ్జయిని మహర్షి సాందీపని వేదవిద్యాప్రతిష్టాన్, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత వేద సమ్మేళనాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే వేద సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేదవిశ్వవిద్యాలయంలో ప్రారంభించి ప్రసంగిస్తూ శరీరానికి మంచి భోజనం ఎంత అవసరమో మనస్సుకు మంచి శబ్దం కూడా అంతే అవసరమని చెప్పారు. ఆ శబ్దమే వేదమని తెలిపారు. టీటీడీ ఎంతో శ్రమకోర్చి వేదవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వేదాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇప్పటికే అనేక శాఖలు లుప్తమైపోయాయని, మిగిలివున్న వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పెరిగిందని చెప్పారు. వేదాల్లో విశేష కృషి చేసిన 12 మందికి ప్రతి సంవత్సరం రూ. 5లక్షలు బహుమతిగా అందిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. వేద పండితులకు సమాజంలో మంచి గుర్తింపు తెస్తామన్నారు. వేద విద్యాప్రతిష్టాన్ వైస్ చైర్మన్ రవీంద్ర అంబాదాస్ మూలే మాట్లాడుతూ వేద పరిరక్షణ తప్పనిసరిగా జరగాలన్నారు. ఈ దిశగా వేదవిద్యాప్రతిష్టాన్ ఇప్పటికే ముందడుగు వేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య మురళీధరశర్మ మాట్లాడుతూ వేదాధ్యయనం చేసిన ప్రతి ఒక్కరూ సంస్కృతాధ్యయనం, శాస్త్ధ్య్రాయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం వేద విద్యార్థులు యోగా ప్రదర్శన చేశారు.