రాష్ట్రీయం

ఉత్పాదన రంగానికి సదస్సు ఉత్ప్రేరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మేకిన్ ఇండియా వారోత్సవ సదస్సు భారత దేశ ఉత్పాదన రంగానికి ఉత్ప్రేరకమమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు.
శనివారం ముంబయిలో జరిగిన మేకిన్ ఇండియా సదస్సులో పాల్గొన్న నారాయణ ప్రసంగించారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పాదక రంగం వాటా ప్రస్తుతం 17.18 శాతంగా ఉందని, దీన్ని 2020నాటికి 25 శాతానికి పెంచడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రం ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పారిశ్రామిక అభివృద్ధి వివరాలను వెల్లడించి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుంటుందన్నారు. వారంపాటు జరిగే మేకిన్ ఇండియా సదస్సు సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని ఆకర్షించడమే రాష్ట్ర ప్రధాన లక్ష్యం కావాలని సిఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాల మేరకే సదస్సునకు హాజరైనట్లు తెలిపారు.
chitram...
మేకిన్ ఇండియా సదస్సు వేదిక వద్దకు ప్రధాని మోదీ తదితరులతో కలిసి వస్తున్న మంత్రి నారాయణ